Renu Desai Inst Post: ఒక్కొక్కరు కనీసం రూ.100 అయినా ఇవ్వండి..

తెలుగు ప్రేక్షకులకు నటి రేణు దేశాయ్ గురించి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది రేణు దేశాయ్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తరువాత జానీ (2003) చిత్రంలో నటించి పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కొన్ని కారణాలవల్ల 2019లోనే వీరిద్దరు విడిపోయారు.

Read More: Renu Desai Comments: వరుణ్-లావణ్యల పెళ్లికి రేణు దేశాయ్ బిగ్ ట్విస్ట్?

ఇక అప్పటినుండి రేణు దేశాయ్ ఒంటరిగా తన పిల్లల బాగోగులను చూసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె సంఘసంస్కర్త హేమలత లవణం పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాదు ఇలాంటి మంచి పాత్రలు లభిస్తే ఇకపై సినిమాలలో నటిస్తానని కూడా తెలిపింది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. తాజాగా రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అదేంటంటే.. రేణు దేశాయ్ ఓ పెట్ లవర్. ఆమె జంతువులను ఎంతగానో ఇష్టపడుతుంది. కొన్ని కుక్కలతో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆమె తట్టుకోలేదు. అంతేకాదు ఆమె పెంపుడు జంతువుల కోసం విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ మూడు కుక్కలకు ఆపరేషన్ చేయించేందుకు ఓ సంస్థ విరాళాలు అడుగుతోంది.

Read More: Renu Desai: పవన్ కు తెలియకుండా రేణు దేశాయ్ అన్ని కోట్లు సంపాదించిందా?

వాటి ఆపరేషన్ కి మొత్తం 55 వేల వరకు ఖర్చు అవుతుందట. ఈ విషయం రేణు దృష్టికి వెళ్లడంతో ఆమె వెంటనే 30,000 విరాళంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. అక్కడితో ఆగకుండా మిగతా డబ్బు కోసం మీ వంతు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా అడిగారు. “నేను 30,000 పంపించాను. దయచేసి ఎవరైనా మిగతా డబ్బును పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు ₹100 పంపించినా చాలు. చాలా హెల్ప్ అవుతుంది” అని రేణు తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు