Renu Desai: పవన్ కు తెలియకుండా రేణు దేశాయ్ అన్ని కోట్లు సంపాదించిందా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత ఆమె ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాలో నటించారు. ఇందులో ఆమె హేమలత లవణం అనే పాత్ర చేశారు. ఇది సినిమా కథను నడిపించే ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రేణు దేశాయ్ తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన ఆదాయం, ఖర్చుల గురించి చెప్పింది. “నా ప్రధాన ఆదాయ వనరు రియల్ ఎస్టేట్ వ్యాపారం. మా అమ్మమ్మ, తండ్రి నుంచి ఈ వృత్తిని వారసత్వంగా పొందాను. వారు కూడా ఇదే రంగంలో ఉన్నారు.

నాకు హైదరాబాద్, పూణేలలో ఆస్తులు ఉన్నాయి. అక్కడే నా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న. ఇక రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన డబ్బును నా పిల్లల చదువుల కోసం, అప్పుడప్పుడు సినిమా నిర్మాణం కోసం పెట్టుబడి పెడుతుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. కాగా రేణు దేశాయ్ కు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిన రేణు దేశాయ్…. తన కాళ్లపై తాను బతుకుతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie News, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు