Bhagavanth Kesari: ఏ దిక్కు లేక ఆ పని చేసిన హీరోయిన్ శ్రీ లీల?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. బాలయ్య తన ఏజ్ కు తగ్గ పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల ముఖ్యపాత్రలో నటించారు. అర్జున్ రామ్ పాల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా కానుకగా ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ చాలా బాగా యాప్ట్ అయింది. ఈ మధ్యకాలంలో చిన్నారి ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను ఈ సినిమాలో సృష్టించాడు. ఆ సీన్ ప్రతి ఒక్క తల్లిదండ్రులను కదలిస్తోంది. ఆడపిల్ల అంటే షేర్ తీర్ లెక్క పెంచాలని కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాపై శ్రీలీల సంచలన వాక్యాలు చేశారు. ‘పెళ్లి సందడి’ చేసే సమయంలోనే ‘భగవంత్ కేసరి’ ఆఫర్ వచ్చింది.
కానీ కథ ప్రకారం బాలయ్యకు కూతురుగా నటించాల్సి ఉందని తెలియడంతో చాలామంది నో చెప్పమన్నారు. ఎందుకంటే అదే టైంలో నాకు హీరోయిన్గా చాలా అవకాశాలు వస్తున్నాయి. దీంతో కూతురు పాత్రలో నటిస్తే కెరియర్ పై దెబ్బ పడుతుందని వద్దన్నారు. కానీ నేను ఒకటే ఆలోచించా. హీరోయిన్ గా ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో అవకాశం వస్తుంది. కానీ ఇలా కూతురి పాత్రలో చేసే అవకాశం రాకపోవచ్చు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోలేదని పేర్కొంది శ్రీలీల.
Check out Filmify Telugu for the latest Tollywood Movie updates, New Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు