Bhagavanth Kesari: అనిల్ ప్రూవ్ చేసుకున్నట్లేనా..?

అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి సినిమా రిలీజయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి, మాస్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండే సినిమా మీద ఆసక్తి నెలకొంది.
సినిమా ట్రైలర్ కూడా హైప్  ని రిలీజ్ డేట్ వరకు క్యారీ చేసింది. సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ డైరెక్టర్ బాలకృష్ణను డీల్ చేసిన విధానానికి క్రిటిక్స్ నుండి అప్లాజ్ వస్తోంది. బాలకృష్ణ నుండి సటిల్ యాక్టింగ్ రాబట్టడంలో అనిల్ సక్సెస్ అయ్యాడు. తెలంగాణ స్లాంగ్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి.
ఇంతకాలం ఎంటర్టైనర్స్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చిన అనిల్ ఈ సినిమాతో సెంటిమెంట్ ని కూడా డీల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అంతే కాకుండా రొటీన్ కామెడీతో సినిమా చుట్టేస్తాడన్న అపవాదును కూడా అనిల్ భగవంత్ కేసరి సినిమాతో చెరిపేశాడని చెప్పాలి. ఇప్పటిదాకా వెంకటేష్ మినహా సీనియర్ హీరోస్ తో పని చేయని అనిల్ బాలకృష్ణ లాంటి సీనియర్ ని డీల్ చేయగలడా అన్న అనుమానం కూడా క్లియర్ అయ్యింది.
బాలకృష్ణ, శ్రీలీల మధ్య సెంటిమెంట్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపించాడు అనిల్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లను కూడా బాలకృష్ణ ఇమేజ్ కి తగినట్టు డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. మొత్తానికి భగవంత్ కేసరి సినిమాతో  తాను ఎంటర్టైనర్స్ కి మాత్రమే పరిమితం కాదని ప్రూవ్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు