Renu Desai: సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడగండి , నా పర్సనల్ లైఫ్ గురించి కాదు

రేణు దేశాయ్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించారు రేణు దేశాయ్. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ , రేణు వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ ఆధ్యా అకిరా అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా తెలిసిందే. కేవలం హీరోయిన్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో ధరించిన బట్టలన్నీటిని దగ్గరుండి సెలెక్ట్ చేశారు రేణు దేశాయ్.

వ్యక్తిగత కారణాలు వలన పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన విషయం మనకు తెలిసిందే. విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పలు విమర్శలు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఆమె నిలబడి లైఫ్ ను లీడ్ చేసింది. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికీ కూడా కొంతమంది భార్యలను ఉద్దేశించి కొన్ని విమర్శలను చేస్తారు. వాటన్నిటిని తట్టుకొని నిలబడటంలో రేణు దేశాయ్ స్ట్రాంగ్.

అఖీరా ను తీర్చిదిద్దిన విధానం, అఖీరా ని పెంచిన విధానం, పెద్దగా బయట కనిపించకుండా దాచిన విధానం, అలానే ఆధ్యాన్ని కూడా పెంచిన విధానం రేణు దేశాయి పైన గౌరవాన్ని నిలబెడతాయి.
ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో “హేమలత లవణం” పాత్రలో కనిపించారు. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

- Advertisement -

ఆ ఇంటర్వ్యూలో ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఒక క్వశ్చన్ ఎదురైంది. దానికి రేణుదేశాయ్ చాలా పవర్ ఫుల్ గా సమాధానం ఇచ్చారు.
మీ వ్యూస్ కోసం, మీ టిఆర్పి కోసం మాలాంటి వాళ్ళని ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. మనం ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ కొచ్చాం. మనం ఇప్పుడు నిర్మాత ఆఫీసులో కూర్చున్నాం. ఇప్పుడు మనం సినిమాకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడాలి. కొన్ని థంబ్ నైల్ సంబంధం లేకుండా పెడతారు మీరు అంటూ రేణు చెప్పుకొచ్చారు.
అలా మీరు సంపాదించినా డబ్బులు కూడా మీకు , మీ పిల్లలకు మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.

ఈ విషయం పై ఆ సదరు యూట్యూబ్ ఛానల్ వ్యక్తి మా ఛానల్లో కంటెంట్
కి సంబంధం లేకుండా ఒక్క థంబ్ నైల్ కూడా కనిపించిన ఆ వీడియోలన్ని డిలీట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దానికి బదులుగా రేణు కూడా చూద్దాం నేను చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఒక సినిమా ప్రమోషన్ కి సంబంధించిన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఆ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగటం సబబు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలోని పాత గాయాలని మళ్లీ బయటికి తీసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అని ఆ సదరు వ్యక్తులు తెలుసుకోవాల్సింది అని కొందరు అభిప్రాయం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు