Renu Desai: ఇలా చిల్లర వేషాలు వేస్తేనే పవన్ అన్న వదిలేశాడు.. పవన్ ఫ్యాన్స్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయ్.. కొణిదెల కుటుంబానికి దూరంగా తన ఇద్దరి పిల్లలతో ఉంటుంది. ఇప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో మళ్లీ వెండి తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈమె పాత్ర చిత్రీకరణ పూర్తి కాగా, సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ చేసే కామెంట్స్ పై ఒక్కోసారి రియాక్ట్ అయి వార్తల్లోకి ఎక్కుతుంది.

ఇటీవల పవన్, రేణు దేశాయ్ కుమారుడు అకీర నందన్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్బంగా రేణు దేశాయ్ తన కుమారుడు అకీరతో ఉన్న ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనికి ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. “కొన్నిసార్లు అయినా అకీరా నందన్ ను చూపించండి. దాచకండి. మా అన్న కొడుకును చూస్తే మాకు చాలా సంతోషం” అంటూ కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్.. “అకీర మీ అన్న కొడుకు కాదు.. నా కొడుకు. ఇలాంటి వాటిని ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాం. ఇకపై ఇలాంటి భరించలేం. ఇలా మాట్లాడే ముందు ఒక సారి ఆలోచించండి. మీ అభిమానం అర్థం చేసుకోగలను. కానీ, మమ్మల్నీ కూడా అర్థం చేసుకోండి” అంటూ కామెంట్ చేసింది.

రేణు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అకీరను మా అన్న కొడుకు అంటే, ఇంత నెగిటివ్ గా మాట్లాడుతారా అంటూ మండిపడతున్నారు. ఒక ఫ్యాన్ అయితే.. “పవన్ ఫ్యాన్స్ అందరూ దీన్ని అన్ ఫాలో కొట్టండి. లైక్స్, కామెంట్స్ చేయకండి. 2024 ఎలక్షన్స్ కి ఈ చిల్లరది కొత్త స్టంట్స్ వేస్తుంది. పవన్ కళ్యాణ్ బయోలాజికల్ ఫాదర్ అయితే.. అన్న కొడుకు అని కాకుండా ఏం అని పిలవాలి. పవన్ కళ్యాణ్ దీన్ని వదిలేసి మంచి పని చేసిండు. ఇది ఇలా చిల్లర వేశాలు ఇంట్లో వేస్తే గెంటేసినట్టున్నారు” అంటూ ఘాటుగా స్పందించాడు.

- Advertisement -

ఈ కామెంట్ పై రేణు దేశాయ్ స్పందించింది. యూజర్ నేమ్ కనిపించకుండా, చేసి, ఇలా ఎలా కామెంట్స్ చేయగలుగుతారు ? మీరు మంచి ఫ్యామిలీ నుంచి వస్తే, ఒక్కసారి మీ తల్లిని అడగండి ఇది కరెక్ట్ గానే ఉందా ? అంటూ స్పందించింది. కాగా, ఈ వ్యవహారం నుంచి పవన్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొంత మంది రేణు దేశాయ్ ను తిట్టిపోస్తుండగా, మరి కొంతమంది మద్దతుగా నిలబడుతున్నారు. కాగా, ప్రస్తుతం రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ కి కామెంట్స్ రాకుండా సెట్టింగ్స్ మార్చుకుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు