Deeksha Seth: ఆ హీరో టార్చర్ భరించలేకే వేదం హీరోయిన్ టాలీవుడ్‌కి దూరమైందా..?

సినిమా సెలబ్రిటీల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సంవత్సరాల కొద్దీ అలాగే పాతుకుపోయి స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతారు. మరికొంతమంది ఒకటి రెండు సినిమాలలో కనిపించి మాయమైపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలా కనుమరుగైపోయిన వారిలో అల్లు అర్జున్ వేదం సినిమాలోని హీరోయిన్ కనిపించిన దీక్షసేత్ ఒకరు. ఈమె 2009లో మిస్ సెమీనా అందాల పోటీలలో ఫైనల్ లిస్టులో ఉంది. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ లోకి రంగ ప్రవేశం చేసి.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నటించింది.

ఆ తరువాత రవితేజ నటించిన మిరపకాయ్ సినిమాలో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడిగా రెబల్ సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా అందం, అభినయం విషయంలో ఎక్కడా ఏ హీరోయిన్ కి తీసిపోని దీక్ష తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత గోపీచంద్ సరసన వాంటెడ్, రవితేజ తో నిప్పు, మంచు మనోజ్ సరసన ఊ కొడతారా ఉలిక్కిపడతారా వంటి సినిమాలలో నటించినప్పటికీ వీటికి అంత క్రేజ్ రాలేదు.

అల్లు అర్జున్ తో నటించిన వేదం సినిమా ఒకటే గుర్తింపు పొందిన పాత్ర చేయడం విశేషం. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ వైపు మొగ్గుచూపింది. 2014లో “లేబర్ హమ్ దివానా దిల్” అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ కూడా ఈమెకు నిరాశే ఎదురైంది. బాలీవుడ్ లో నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ కావడంతో.. చివరకు కన్నడలో దర్శన్ సరసన జగ్గు భాయ్ అనే సినిమాలో నటించింది.

- Advertisement -

సినిమా కూడా అట్టర్ ఫ్లాప్. దీంతో ఆమె ఐరన్ లెగ్ అనే పేరుని కూడా మూటగట్టుకుంది. వరుస ఫ్లాప్ లు రావడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ప్రస్తుతం దీక్షా సెత్ లండన్ లో నివసిస్తుంది. అక్కడ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న క్రమంలో ఓ టైర్ 2 యంగ్ హీరో దీక్షాసేత్ ని బాగా హెరాస్ చేసేవాడట. మొదట్లో హీరోతో ఆమె మంచిగానే ఉన్నప్పటికీ.. అతడు చేసే హెరాస్ తట్టుకోలేకే ఆమె టాలీవుడ్ కి దూరమైంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు