NTR30: కొరటాల బిగ్ స్కెచ్.. తారక్ టైటిల్ లీక్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్30. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ వచ్చి దాదాపు ఏడాది కావస్తుండగా, ఇటీవల రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు గుర్తింపు రావడం, ఆచార్య చిత్రంతో కొరటాల శివ ఇమేజ్ పడిపోవడం. వంటివి జరిగిన తర్వాత వీరి నుంచి వస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ అంతటి హిట్ కొట్టాలని ఎన్టీఆర్, ఆచార్యతో పోయిన ఇమేజ్ ను మళ్లీ రాబట్టాలని కొరటాల శివ.. ఇద్దరు కసితో ఈ సినిమాను చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పట్లను కూడా కొరటాల భారీగానే చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూట్ జాన్వీ కపూర్ ను ఎంపిక చేశాడు. విలన్ పాత్ర కోసం అదే బాలీవుడ్ నుంచి స్టార్ హీరోను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ సంప్రదించగా, సైఫ్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా, ఎన్టీఆర్ 30కి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే ఆసక్తి ప్రస్తుతం నందమూరి అభిమానుల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు ఉంది. అయితే దీనిపై కొంత మంది అభిమానులు.. ఎన్టీఆర్ 30 టైటిల్ ను డైరెక్టర్ కొరటాల శివ చాలా రోజుల క్రితమే లీక్ చేశారు అని అంటున్నారు. గతేడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 ను అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో “వస్తున్నా..” అంటూ ఎన్టీఆర్ వాయిస్ వస్తుంది. ఈ “వస్తున్నా..” నే టైటిల్ గా ఫిక్స్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -

కాగా, ఇటీవల “వస్తున్నా..” అనే వర్డ్ చాలా పాపులర్ అయింది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా, ఎన్టీఆర్, బన్నీ మధ్య జరిగిన సంభాషణలో కూడా బన్నీ “వస్తున్నా..” అంటూ కామెంట్ చేసిన సంగతి విధితమే. దీంతో “వస్తున్నా..” అనే టైటిల్ బాగానే ఉంటుంది అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరీ నిజంగానే ఎన్టీఆర్ 30 టైటిల్ “వస్తున్నా..” నేనా, లేదా మరెదైనా ప్లాన్ చేస్తున్నారా ? అని తెలియాంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు