Agent: అక్కినేని వారసుడితో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్..

అఖిల్ అక్కినేని హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న “ఏజెంట్ ఈ నెల 28న విడుదలకి సిద్దమవుతుంది. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని AKఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. మరో నిర్మాతగా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అండర్ వరల్డ్, స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది.  విడుదల తేదీ దగ్గరవుతుండటంతో ఏజెంట్ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోను మేకర్స్ చాల పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.

ఎలాగైనా అఖిల్ కి మంచి సాలిడ్ హిట్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఏ విషయంలోనూ కంప్రమైస్ కాకుండా ప్రేక్షకులకి బెస్ట్ థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే సినిమాలో ఉండే కీలకమైన సన్నివేశంలో రాబోయే ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ ఓవర్ ది టాప్ అయినా కూడా కంప్రమైస్ కాకుండా ఊర్వశి ని కాస్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

వాల్తేరు వీరయ్య”లో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ భామ , ఈ మధ్య సౌత్ సినిమాల్లో బాగా బిజీ అయిపొయింది. మొన్న ఈ మధ్యనే వచ్చిన లెజెండ్ అనే తమిళ్ సినిమాలో కూడా ఊర్వశి ఒక కీలక పాత్రలో కనిపించారు. మరో పక్క బోయపాటి , రామ్ కాంబో వస్తున్న మూవీలో కూడా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది ఈ భామ. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితయినా ఊర్వశి రౌతేలా ఇప్పుడు వరుస సినిమాలతో సౌత్ లో బిజీ అయిపొయింది. అయితే ఊర్వశికి సౌత్ లో ఐటెం సాంగ్స్ లోనే అవకాశాలు వస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు