Shankar: ఇండియన్ 2 విషయంలో ఆలోచన మార్చుకున్నాడా ?

దిగ్గజ దర్శకుడు శంకర్ తన లైఫ్ లోనే ఫస్ట్ టైమ్.. రెండు చిత్రాలకు ఒకేసారి దర్శకత్వం వహిస్తూ బిజీబిజీగా ముందుకు సాగుతున్నాడు. ఈయన ఇంత వరకు ఒకేసారి రెండు సినిమాలు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఒక పక్క కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రం రూపొందిస్తూ.. మరోపక్క రామ్ చరణ్ “గేమ్ చేంజర్” మూవీని శరవేగంగా పూర్తి చేస్తూ బిజీ షెడ్యూల్స్ తో గడిపేస్తున్నాడు. సాధారణంగా తన ఒక్కో చిత్రానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకునే శంకర్.. ప్రస్తుత పరిస్థితుల నేపద్యంలో ఈ రెండు చిత్రాలకు వేరువేరు తేదీలు కేటాయించి మరీ షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాడు.

ఈ మధ్యనే రామ్ చరణ్, కియారా అద్వానీ లపై హైదరాబాద్ లో ఓ పాటను చిత్రీకరించిన విషయం తెలిసిందే. అది పూర్తి కాగానే ఇండియన్ టు కోసం తైవాన్ చేరుకున్నాడు. వీలైనంత తొందరగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాడు శంకర్. తైవాన్ లో కీలక షెడ్యూల్ ని ముగించుకొని త్వరలో తదుపరి షెడ్యూల్ కోసం సౌత్ఆఫ్రికాకు వెళ్ళనున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి బడ్జెట్ విషయంలో కూడా ఆయన పెంచడం లేదు. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలో అలా కాదు.. దిల్ రాజు కి దడ పుట్టిస్తూనే ఉన్నారు. ఇండియన్ 2 చిత్రానికి బడ్జెట్ పెంచకపోవడానికి కారణం నిర్మాతలతో జరిగిన వివాదాలు, కేసుల వంటి కారణాలతోనే ఇలా జరిగి ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. జూలై నాటికి ఇండియన్ 2 చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి దీపావళి కానుకగా విడుదల చేయాలని శంకర్ భావిస్తున్నారట.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు