Tollywood: ఇండస్ట్రీ పెద్దల సాక్షిగా దిల్ రాజుకి అవమానం?

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను ఆస్కార్ గెలిచినందుకు గాను ఏప్రిల్ 9 న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున 24 క్రాఫ్ట్స్ యూనిట్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కలిసి ఆస్కార్ విజేతలైన మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ ని, అలాగే ‘ఆర్ ఆర్ ఆర్’ డైరెక్టర్ రాజమౌళిని సత్కరించడం జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్టాల తరపున సినిమాటోగ్రఫీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేణు గోపాల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యి వారిని సత్కరించారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున కే. రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పరుచూరి గోపాల కృష్ణ, హీరోలు రానా, సుశాంత్, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి జీవిత, రాజశేఖర్, మాదాల రవి, అలాగే ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ కి సంబంధించిన టీమ్ హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చారు. అయితే వీరు కార్యక్రమం స్టార్ట్ అయిన అరగంట తర్వాత రావడం జరిగింది.

- Advertisement -

కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ కార్యక్రమంలో స్టేజి పైన అంత ఉత్సహంగా పాల్గొనలేదు. కారణమేంటో సరిగ్గా తెలియదు గాని నిన్న దిల్ రాజు చాలా అసహనంగా ఉన్నాడు. స్టేజి పైన RRR చిత్ర యూనిట్ కి సన్మానం చేసే సమయంలో కూడా దిల్ రాజు పైకి రాలేదు. చివర్లో ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో కలిసి పైకి వచ్చి కాసేపు ఉన్నాడు. ఆ తర్వాత ఫోటో షూట్ లో కూడా ఉండకుండా వెంటనే వెళ్ళిపోయాడు. దీనిపై సినీ వర్గాల నుండి వార్తలు గుప్పు మంటున్నాయి.

అయితే టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు పై గత కొంత కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని వ్యతిరేకతలు వినబడుతున్నాయి.
24 క్రాఫ్ట్ లో కూడా దిల్ రాజు పై కొన్ని వాదనలు వచ్చాయి. ఆ మధ్య కార్తికేయ2 సినిమా విడుదల విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో తెలిసిందే. మరి ఇప్పుడు వీళ్లంతా కలిసి దిల్ రాజు ని ఇన్ డైరెక్ట్ గా అవమానించారా? అన్న వార్తలు వినబడుతున్నాయి. మరో సమాచారం ప్రకారం ఈ ప్రోగ్రాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కలిసి చేయడం జరిగింది. కాబట్టి మంచు విష్ణు తరపున ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలని కావాలనే పిలవలేదని వార్తలు వినబడుతున్నాయి.

కారణాలేంటో తెలియదు గాని నిన్న దిల్ రాజు కి ఒక రకంగా అవమానం జరిగినట్టే అని భావించవచ్చు. దిల్ రాజు ఈ విషయం పై ఎక్కడ మాట్లాడకపోయినా, తన టైం వచ్చినపుడు తనేంటో చుపిస్తాడని అంటున్నారు. అయితే కొంత మంది ప్రముఖులు దిల్ రాజు విషయం లో 24 క్రాఫ్ట్స్ యూనిట్ సభ్యులు ఇలా ప్రవర్తించాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. మరి దిల్ రాజు అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై స్పందించలేదు. ఈ ప్రోగామ్ లోని దిల్ రాజు కి సంబంధించిన ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు