Prabhas : ” ప్రాజెక్ట్ కె” కొత్త అప్డేట్

ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం” ప్రాజెక్ట్ కె. ” ఫ్యూచరిస్టిక్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక వర్కింగ్ ప్రోగ్రెస్ వీడియోని స్వప్న దత్ రిలీజ్ చేసారు. కిందటి సారి స్క్రాచ్ ఎపిసోడ్ వన్ అంటూ ఒక టయర్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి అందరిని సర్ప్రైజ్ చేసారు. ఒక టయిర్ కోసం ఇంత చేసారా అని అనుకున్నారు అందరు. అయితే ఈసారి స్క్రాచ్ ఎపిసోడ్ టూ అంటూ మరో వీడియో రిలీజ్ చేసారు. సినిమాలో రైడర్స్, విలన్స్ ఎలా ఉండబోతున్నారు అనేది చూపిస్తూ వాళ్ళు చేసిన డిజైన్, దానికి సంబంధించిన మేకింగ్ ని జత చేస్తూ వీడియో రిలీజ్ చేసారు.

ఫ్యూచరిస్టిక్ సినిమా అంటే ప్రతిదీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనే పాయింట్ మీద వర్క్ చేయాల్సి ఉంటది. ఇది ఫాంటసీ, హిస్టారికల్ సినిమాలు తీయడం కన్నా కష్టం. ఎందుకంటే ఫాంటసీ , హిస్టారికల్ సినిమాలలో ఇంతకు ముందు ఎలా ఉండేది అనే రిఫరెన్స్ లు ఉంటాయి. కానీ ఫ్యూచర్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే క్లారిటీ దాదాపు ఎవరికీ ఉండదు.

అందుకే ఇలాంటి సినిమాలు తీసే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. మరి ఇలాంటి ఐడియాని స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటది. స్క్రాచ్ నుంచి ప్రతీది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం నాగ్ అశ్విన్ టీం అదే చేస్తున్నారు. గతంలో టయర్ మేకింగ్ ఎలా చేసారో చెబుతూ వీడియో పోస్ట్ చేసినట్టే, ఇప్పుడు రైడర్స్ ఎలా ఉండబోతున్నారో చూపించారు. హాలీవుడ్ రేంజ్ స్టాండర్స్ తో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు వాళ్ళ వీడియోస్ ద్వారా తెలుస్తుంది.

- Advertisement -

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకునే ప్రభాస్ కి జోడీగానటిస్తుంది. 2024 జనవరి 12న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు