Samantha: ప్రేమగా నటించడం నాకు చేతకాదు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నుంచి తాజాగా శాకుంతలం అనే చిత్రం వస్తున్న సంగతి విధితమే. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీని కోసం ఇటీవలే మయోసైటీస్ నుంచి పూర్తి కోలుకున్న సమంత ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ లో పాల్గోంటుంది. ఈ ప్రమోషన్స్ లో ఎప్పుడు లేని విధంగా, తన పర్సనల్ లైఫ్ సమంత స్పందిస్తుంది. డైవర్స్ అయిన తర్వాత సమంత, తన పర్సనల్ లైఫ్ గురించి స్పందించడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదు.

కానీ, శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా, వరుస ఇంటర్వ్యూలల్లో పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవలే, తన వైవాహిక జీవితంలో 100 శాతం నిజాయితీగా ఉన్నానని, ఎవరో చేసిన తప్పుకు తాను బాధపడనంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా లవ్ పై తన అభిప్రాయాన్ని సమంత వెల్లడించింది.

“నా జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. నాకు వచ్చిన కష్ట సుఖాలను అందరూ చూడొచ్చు. కొన్ని విషయాలను దాచడం, ఫేక్ ఉండటం నాకు నచ్చదు. జీవితంలో ప్రేమించడం మాత్రమే తెలుసు. కొంత మంది ప్రేమిస్తూ నటిస్తారు. అలా నటించడం నాకు చేత కాదు. దీని వల్ల నా ద్రుష్టిలో ప్రేమ మీనింగ్ మారిపోయింది అంటూ చెప్పుకొచ్చింది” అయితే ఇటీవల కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ తనపై చూస్తున్న ప్రేమను చూస్తుంటే, ఇంకా ప్రేమ బతికే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అంటూ సామ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ తో మరోసారి సమంత, శాకుంతలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

సమంత ఈ వ్యాఖ్యలను ఎంత బాధను అనుభవిస్తూ చేసిందో.. ఎవరో ద్రుష్టిలో ఉంచుకుని చేసిందో అర్థమవుతుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత.. విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updatesGossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు