Dhanush: మరోసారి మారి సెల్వరాజ్ తో ధనుష్

రఘువరన్ బిటెక్ సినిమాతో ధనుష్ మన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరై పోయారు. తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణ, అభిమానం చూసిన ధనుష్ రీసెంట్ గానే “సా ర్ “మూవీతో స్ట్రయిట్ తెలుగు సినిమా చేసారు. దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, ధనుష్ ని తెలుగులో 100 కోట్ల హీరోని చేసింది.

అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకి ఆ మధ్య ఒకే చెప్పారు. కానీ ఆ సినిమా ఇంకా ప్రి ప్రొడక్షన్ దశలోనే ఉంది. అయితే శేఖర్ కమ్ముల సినిమా ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి రాకపోవడం తో ధనుష్ మరో సినిమాని పట్టాలెక్కించనున్నారు.

జీ స్టూడియోస్ నిర్మాణంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ ఒక మూవీ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేసారు. గతంలో ధనుష్ మారి సెల్వరాజ్ తో “కర్ణన్” అనే మూవీ చేసారు. ఈ మూవీ మంచి విజయం సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. కర్ణన్ తర్వాత వీళ్ళ కాంబో వస్తున్న సినిమా అవడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా  మూవీ కి సంబందిచిన పోస్టర్ ని ఒకటి విడుదల చేసారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు