Tollywood: TFI తరపున ఆస్కార్ విన్నర్స్ కి గౌరవ సత్కారం

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన “RRR” చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో మనందరికీ తెలిసిందే. 2022 మార్చ్ 25 న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకి పైగా వసూలు చేసింది. అంతే కాదు ఈ మధ్యనే జపాన్ లో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా గా నిలిచింది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా సాధిస్తున్న అవార్డులు, రివార్డులు ఏ సినిమా సాధించలేదు.

ఇక రీసెంట్ గా 2022 కి గాను ప్రపంచ వ్యాప్తంగా సినిమాలకి ఇచ్చే గొప్ప అవార్డు ఆస్కార్. ఈ అవార్డు కి ఇండియా నుంచి ప్రతి సంవత్సరం చాలా సినిమాలు నామినేషన్ కి వెళ్తాయి. బట్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకు పెద్దగా ఆస్కార్ అవార్డు లు లభించలేదు. ఏ. ఆర్ రహమాన్ కి వచ్చినా అది ఇండియన్ సినిమా కి రాలేదు. అయితే ఈ సంవత్సరం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి గాను రెండు ఆస్కార్ అవార్డు లు లభించాయి.

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని “నాటు నాటు” పాటకి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీ లో కీరవాణి, చంద్రబోస్ లకు అవార్డులు వచ్చాయి.
రాజమౌళి దగ్గరుండి ఈ సినిమాను ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రమోట్ చేశాడు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున, 24 క్రాఫ్ట్స్ తరపున “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్” సభ్యులు కలిసి నిన్న ఏప్రిల్ 9 న ఆస్కార్ విన్నర్స్ అయిన లెజెండరి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, రచయిత చంద్రబోస్ లను మరియు RRR సినిమా దర్శకుడు రాజమౌళిని ఘనంగా సత్కరించారు.

- Advertisement -

ఈ వేడుకకు ముఖ్య అతిధులు గా తెలుగు రాష్ట్రల మంత్రులు హాజరయ్యారు. తెలంగాణా ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రి వేణు గోపాల్ కలిసి ఆస్కార్ విజేతలను అలాగే రాజమౌళిని సత్కరించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున లెజెండరీ దర్శకుడు శ్రీ కె. రాఘవేంద్ర రావు, ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, డి.సురేష్ బాబు అతిధులుగా వచ్చారు. ఇంకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు జీవిత,రాజశేఖర్, మాదాల రవి , నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇంకా హీరోలు రానా, సుశాంత్ పలువురు హాజరయ్యారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు