Pawan kalyan :వకీల్ సాబ్-2 రాబోతుంది

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అయితే తాజాగా ఆయన మళ్ళీ ఇంకొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్సినట్టు వార్త వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్సిన తరువాత ఇకపై సినిమాలు చేయను, ప్రత్యేక్ష రాజకీయాలకే పరిమితం అవుతాను అని స్టేట్మెంట్ ఇవ్వడంతో, అప్పటిదాకా పవన్ తో సినిమా చేద్దామనుకునే వాళ్లంతా, వాళ్ళ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, వారిలో దిల్ రాజు కూడా ఒకడు. దిల్ రాజుకి పవన్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక , చాలా సార్లు పవన్ తో సినిమా చేయాలనీ ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఆ తరువాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో దిల్ రాజు కల కలగానే మిగిపోయింది.

అయితే రాజకీయాలు అంటే ఆషామాషీ కాదు , మనీ లేనిదే ఇక్కడఏ పని నడవదు అని పవన్ కొద్దీ రోజుల్లోనే గ్రహించాడు. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లలన్న , పార్టీనే నమ్ముకున్న కార్యకర్తల కడుపు నింపాలన్న డబ్బులు కావాలి , అందుకే పవన్ మళ్ళీ సినిమాలు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. పవన్ సినిమా చేద్దామనుకుంటున్నాడు అని తెలియగానే వెంటనే దిల్ రాజు రియాక్ట్ అయ్యాడు. బాలీవుడ్ సూపర్ హిట్ అయినా “పింక్” సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్పు చేసి “వకీల్ సాబ్” సినిమా తీసాడు.పవన్ సినిమా అంటేనే ఒక సెలబ్రేషన్ లాంటిది, అందులోను కంబ్యాక్ సినిమా అంటే ఫ్యాన్స్ గోల మాములుగా ఉండదు., కానీ అప్పుడున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా లిమిటెడ్ ప్రమోషన్స్ తో ఈ సినిమాని రిలీజ్ చేసారు.50% మాత్రమే థియేటర్స్ ఆక్యుపెన్సీ, లో-టికెట్ ప్రైస్ లాంటి ఇబ్బందుల నడుమ వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి ,బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇక అసలు విషయానికొస్తే వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని దిల్ రాజు పార్ట్ వకీల్ సాబ్ -2 కథ రెడీ చేయమని అడిగారంట, వేణు కూడా పార్ట్ -2 కి సంబంధించి లైన్ ని ఆయనకి వినిపించరంట.దాంతో దిల్ రాజు మళ్ళీ పవన్ తో మాట్లాడి వకీల్ సాబ్-2 కి ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారంట. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో “గేమ్ చెంజర్” మూవీ తప్ప పెద్ద సినిమాలేవీ లేవు ,సో పవన్ తోనే నెక్స్ట్ సినిమా ఉండొచ్చు అని టాక్ .ఈ విషయాన్ని స్వయంగా వేణు శ్రీరామ్ గారే క్లబ్ హౌస్ డిస్కషన్స్ లో చెప్పారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు