Bhagavanth Kesari Movie Review

అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి ఈ పేరు శానా ఏళ్లు యాదింటది. ఈ డైలాగ్ ఏ మూహుర్తాన వచ్చింది ఏమో కానీ, బాలయ్య ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ అని. అలాగే ట్రైలర్‌లో చూసింది తక్కువే.. మూవీలో చూడాల్సింది చాలా ఉందని, బాలయ్యను కొత్త అవతార్ లో చూస్తారని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. Bro I Don’t Careతో పాటు మరి కొన్ని డైలాగ్స్‌ ఆ హైప్ ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. మరి అంతటి బజ్ ఉన్న భగవంత్ కేసరి మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్ధాం.

కథ:

వరంగల్ జైల్‌లో అదిలాబాద్ కి చెందిన నేలకొండ భగవంత్ కేసరి ఖైదీగా ఉంటాడు. పోలీస్ అధికారి శరత్ కుమార్‌తో పాటు ఆయన కూతురు విజయ లక్ష్మి / విజ్జి (శ్రీలీల)తో భగవంత్ కేసరికి ఓ ఘటన వల్ల పరిచయం ఏర్పడుతుంది. అయితే ఓ ఆక్సిడెంట్‌లో శరత్ కుమార్ చనిపోతాడు. ఆగస్ట్ 15 సందర్భంగా జైలు నుంచి విడుదలైన భగవంత్ కేసరి… విజ్జి బాధ్యతలను భగవంత్ తీసుకుంటాడు. అయితే శరత్ కుమార్ చనిపోయే ముందు… విజ్జిని ఆర్మి అధికారిని చేయాలని భగవంత్ కేసరికి ప్రామిస్ తీసుకుంటాడు. దీంతో విజ్జిని ఎలాగైన ఆర్మి ఆఫీసర్ ను చేయాలని భగవంత్ ప్రయత్నిస్తుంటాడు.

- Advertisement -

అదే సమయంలో రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్) దేశంలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో డిప్యూటి చీఫ్ మినిస్టర్‌ని రాహుల్ సంఘ్వీ చంపేస్తాడు. ఈ హత్య గురించి, రాహుల్ సంఘ్వీ చేసిన మోసాల ఇన్ఫర్మేషన్ అనుకోకుండా విజ్జి ల్యాప్ టాప్‌లోకి వస్తుంది. దీంతో విజ్జిని రాహుల్ సంఘ్వి చంపాలని చూస్తాడు. వారి నుంచి విజ్జిని భగవంత్ కేసరి ఎలా కాపాడాడు? రాహుల్ సంఘ్వికి భగవంత్ కేసరి ఉన్న పాత పరిచయం ఏంటి? భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఎన్నో ఫోబియాలు ఉన్న విజ్జి ఆర్మీ ఆఫీసర్ అయిందా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇండస్ట్రీలో సినిమా కథలు చాలా తక్కువ ఉంటాయి అనేది నిజం. తెలిసిన కథనే డైరెక్టర్ తన టాలెంట్‌తో స్క్రీన్ ప్లే రాసుకుని ఆడియన్స్‌ను మెప్పించాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఇదే చేశాడు. అయితే ఇక్కడ భగవంత్ కేసరిలో రెండు స్టోరీలు ఉన్నాయి.

ఒకటి… విలన్ వల్ల హీరో సొంత ఊరు వదిలి, జైల్‌కి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత అనుకోని కారణాల వల్ల విలన్ మళ్లీ హీరో లైఫ్‌లోకి వస్తాడు. ఈ సారి హీరో పాత పగ, కొత్త పగ మొత్తం తీర్చుకుంటాడు. ఈ స్టోరీని చాలా సినిమాల్లో చూశాం.

రెండో స్టోరీ… అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు అనుకోకుండా, విలన్స్ గొడవలో ఇరుక్కుంటుంది. దీంతో విలన్స్‌కి టార్గెట్ అవుతుంది. కూతురును కాపాడుతూ… విలన్‌లను ఎదుర్కొంటాడు హీరో. ఈ రకమైన స్టోరీలతో కూడా ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఈ రెండు స్టోరీలను మిక్స్ చేసి అనిల్ రావిపూడి తన స్టైల్‌లో భగవంత్ కేసరి సినిమా చేశాడు.

అలాగే బాలయ్య సినిమాలంటే… ఆడియన్స్ అందరూ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ నే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే అనిల్ రావిపూడి సినిమాలంటే… కాస్త ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ రెండింటిని కలిపి జాగ్రత్తగా తీసిన సినిమానే భగవంత్ కేసరి. అయితే దీనిలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఉంటుంది. కానీ, ఎక్కువగా ఉండదు. అనిల్ కాన్సన్ట్రేషన్ మొత్తం బాలయ్యపై యాక్షన్ సీన్స్ పెట్టాలి.. మంచి ఎలివేషన్ సీన్స్ ఇవ్వాలి అనుకునే సినిమా చేశాడు. మధ్య మధ్యలో అనిల్ మార్క్ ను కూడా జోడించాడు. నిజానికి ఈ సినిమాకు ఇంతకు మించి కామెడీ ఇస్తే, సినిమానే కామెడీ అయిపోయేది. అలా కాకుండా బ్యాలెన్సింగ్ చేయడం ఒక ప్లస్ పాయింట్.

ఫస్టాఫ్‌లో దాదాపు 30 నుంచి 40 నిమిషాల వరకు పాత్రల పరిచయానికే తీసుకున్నాడు. అసలు సినిమా ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్… ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్‌తో బాలయ్య అభిమానులు సీటులో కూర్చోరు అనేది మాత్రం నిజం. స్లోగా స్టార్ అయి… బ్లాస్టింగ్ గా వెళ్తుంది స్క్రీన్ ప్లే. ఇక సెకండాఫ్ లో అయితే అనిల్ రావిపూడి ఎక్కడా తగ్గలేదు. బాలయ్యను ఎక్కడా తగ్గించలేదు. సెకండాఫ్ లో ప్రతి సెకండ్ సినిమాను హిట్ చేయడానికి వాడుకున్నాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా హీరో హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత బస్ లో వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. కళ్లలో కళ్లు పెట్టు చూడు… అనే సాంగ్ బ్యాగ్రౌండ్ లో వేసి అంతా సీరియస్ ఫైట్ ను కామెడీ చేసి, ఆడియన్స్ విజిల్స్ వేయించాడు అనిల్. అలాగే సినిమాలో బాలయ్య నుంచి వచ్చే డైలాగ్స్‌పై అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టినట్టు తెలుస్తుంది. ఒక్కో డైలాగ్… శానా ఏళ్లు యాదింటాయి.

నిజానికి తెలుగు ఇండస్ట్రీలో ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్లు ఇద్దరు మాత్రమే. ఒకరు జక్కన్న అయితే.. మరొకరు అనిల్ రావిపూడి. సినిమా కాస్త స్లో అవుతుందని ఫీల్ వచ్చినప్పుడు… ఓ హై ఇచ్చే సీన్ పెడతాడు. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి సీన్స్ భగవంత్ కేసరిలో చాలా ఉన్నాయి. ఇక మధ్యలో అమ్మాయిల గురించి బాలయ్య ఇచ్చే స్పీచ్ చూస్తే… డైరెక్టర్ అనిల్ రావిపూడి మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎప్పుడు కామెడీ సినిమాలు చేసే అనిల్‌లో ఇంత విషయం ఉందా? అనిపిస్తుంది.

బాలయ్య నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇక ఇలాంటి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో బాలయ్య ఫర్మామెన్స్ కు మైనస్ లు పెట్టడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఇక సినిమాలో మాట్లాడుకోవాల్సి క్యారెక్టర్… విజ్జి. శ్రీలీల కెరీర్ లో బెస్ట్ ఫర్మామెన్స్ అని చెప్పొచ్చు. శ్రీలీల మరో కోణం చూశాం. క్లైమాక్స్ లో చూసిన తర్వాత భగవంత్ కేసరి సింగిల్ స్టార్ మూవీ కాదు… మల్టీ స్టారర్ అని అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత శ్రీలీల ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ సీన్స్ చెయొచ్చు. కాజల్ పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. కానీ ఉన్న దాంట్లో కాజల్ అందంగా కనిపించింది.

థమన్ ఇప్పటికే అన్ని సినిమాల్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రూఫ్ చేసుకున్నాడు. భగవంత్ కేసరి కూడా థమన్ హిట్ లిస్ట్ ఒకటి అని ఒక్క మాటలో చెప్పొచ్చు. అలాగే సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా మెయింటెన్ చేశారు.

పాజిటివ్ పాయింట్స్:

బాలయ్య, శ్రీలీల యాక్టింగ్
అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే
మ్యూజిక్
కొన్ని యాక్షన్ సీన్స్
బాలయ్య, అనిల్ లో కొత్త కోణం

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్‌లో మొదటి 30 నిమిషాలు

మొత్తంగా… ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫర్ఫెక్ట్ మీల్

రేటింగ్ : 3.0/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు