Thamanna: తమన్నా సడెన్ గా బరువు పెరిగింది అందుకేనా..?

తమన్నా.. పరిచయం అవసరం లేని పేరు. ఈ ముద్దుగుమ్మని అభిమానులు మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె అందానికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయినా ఇప్పటివరకు అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈమె వయసు 33 ఏళ్లు అయినా కూడా ఆమె ఇప్పటికీ 25 ఏళ్ల యువతి లాగే కనిపిస్తోంది. అయితే తమన్నా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే తమన్నా ఉన్నపలంగా బరువు పెరిగిపోయిందని. ఈ విషయం మనకి సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలోని “కావాలయ్యా” పాటలో ఈజీగా అర్థమయిపోతోంది. ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకోలేని తమన్నా బాలీవుడ్ లో ఎలాంటి వెబ్ సిరీస్ లలో నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ మధ్య ఎక్కువగా బోల్డ్ సీన్స్, బోల్డ్ సిరీస్ లని ఎంచుకుంటుంది. అయితే బరువు పెరిగిన కారణంగానే ఆమెకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేయి జారిపోతున్నాయట. ఈమె ఎందుకు ఇంత బరువు పెరిగింది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అయితే డైట్ లో ఉన్నప్పటికీ స్వీట్స్ ఎక్కువగా తిన్న కారణంగానే బరువు పెరిగి ఉండవచ్చు అంటున్నారు జనాలు. అంతేకాదు మందు కూడా ఎక్కువగా సేవించడం వల్ల బరువు పెరిగి ఉండవచ్చు అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు