Renu Desai: నేను మారను – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన బెంగాలీ బ్యూటీ రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లపాటు ప్రేమ జీవితం సాగించిన వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట ఆ తర్వాత అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకుంది. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య అని పిలిపించుకోవడానికి కూడా రేణు దేశాయ్ ఇష్టపడరు. పవన్ తనతో కలిసి ఉన్న సమయంలోనే మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని పలు సందర్భాల్లో విమర్శించారు. ఇక రీసెంట్ గా తన కొడుకు అకీరాని ‘మా అన్న కొడుకు’ అని ఫ్యాన్స్ సంబోధించడం పై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అకిరా నా కొడుకు… మీ అన్న కొడుకు ఏంటి? ఒక తల్లికే పుట్టావా? సరిగ్గా మాట్లాడటం నేర్చుకో’ అని నేను ఫైర్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం మొదలైన ఈ సోషల్ మీడియా వార్ ఇప్పటికే కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్ మార్చుకోండి. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోండి. అంటూ రేణు దేశాయ్ కి ఉచిత సలహాలు ఇస్తున్నారు. పవన్ అభిమానుల సలహాలను రేణు దేశాయ్ తప్పుపట్టారు. ‘సమాజంతో ఇదే ప్రాబ్లం. ఎవరి కోసమో నేను మారాలా? మీరు చెప్పినట్టు జీవించడానికి నేను ఏమీ తప్పు చేశాను. సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది’ అని ఇన్ స్టా స్టోరీలో రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు