Mega Daughter: నిహారిక ఆస్తులు అన్ని కోట్లా?

‘ఒక మనసు’తో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సైరా నరసింహారెడ్డి లో భాగ్యగా అలరించింది. నిహారికకు సినిమాల కంటే వెబ్ సిరీస్ లు బాగా కలిసి వచ్చాయి. ఆమె నటించిన ‘ముద్దుపప్పు ఆవకాయ’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచి మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో వరుసగా అలాంటి వెబ్ సిరీస్ లు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

వెబ్ సిరీస్ లో నటించడమే కాదు వాటికి నిర్మాతగాను వ్యవహరిస్తోంది. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు నిహారిక ఆస్తులు విలువ ఎంత అనేదానిపై చర్చ జరుగుతోంది. మనం దానిపై వివరాలు తెలుసుకుందాం. 1993 డిసెంబర్ 18న జన్మించిన నిహారిక హైదరాబాద్ సెయింట్ మెరీన్ కాలేజీలో చదువుకుంది. చదువు పూర్తయిన తర్వాత టీవీ యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఢీ జూనియర్ వంటి వాటికీ హోస్టుగా వ్యవహరించి, ఒక మనసు సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టింది.

ఈమె తమిళ వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ 2020 నాటికి నాలుగు మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 30 కోట్ల కంటే ఎక్కువ. ఈమె ఒక్కో సినిమాకి సుమారు రూ.25 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది అని కూడా చెబుతున్నారు. నిహారిక హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో నివసించేది. ఆమెకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు