Aishwarya Rai: చేతికి కట్టుతో ఐశ్వర్యరాయ్.. ఆందోళనలో ఫాన్స్..!

టాలీవుడ్ , బాలీవుడ్ ప్రేక్షకులకు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బాగా సుపరిచితుమే.. తన అందంతో ఏకంగా ప్రపంచాన్నే మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారిగా నిలిచిపోయింది.. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించిన ఐశ్వర్యారాయ్ తన నటనతో అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అయితే ఇటీవలే ఐశ్వర్యారాయ్ అడపా దడపా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఎక్కువగా తన కుటుంబంతోనే గడపడానికి మక్కువ చూపుతోంది.. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో లేదా ఏదైనా ప్రైవేట్ పార్టీలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఐశ్వర్యరాయ్. ఇదిలా ఉండగా గత సంవత్సరం ప్రముఖ కోలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమాతో భారీ పాపులారిటీ కూడా సొంతం చేసుకుంది ఐశ్వర్యరాయ్..

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు బయలుదేరిన ఐశ్వర్యరాయ్..

Aishwarya Rai: Aishwarya Rai with a bandage.. Fans are worried..!
Aishwarya Rai: Aishwarya Rai with a bandage.. Fans are worried..!

ఇకపోతే ఐశ్వర్యరాయ్ ప్రస్తుత వయసు 50 ఏళ్లు.. అయినప్పటికీ కూడా ఇంకా తన అందంతో.. ఫిట్నెస్ తో యంగ్ హీరోయిన్లకు దీటుగా అలరిస్తూనే ఉంది.. అంతేకాదు ఐశ్వర్యరాయ్ ఎక్కడ కనిపించినా కూడా తన కూతురు ఆరాధ్య తోనే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం గమనార్హం. తాజాగా ఫ్రాన్స్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నది.. ఈ ఫెస్టివల్ కి దేశ విదేశాల నుంచి చాలామంది సెలబ్రిటీలు కూడా గెస్ట్ లుగా వస్తున్నారు.. అక్కడికి ఐశ్వర్యరాయ్ కూడా ఇండియా తరఫు నుంచి వెళ్ళింది.. అయితే ఇలా వెళ్లడం ఈమెకు మొదటిసారి కాదు ప్రతి ఏడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్తూనే ఉన్నది.

చేతికి కట్టుతో ముంబై ఎయిర్పోర్ట్లో దర్శనం..

ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా.. నిన్నటి రోజున రాత్రి ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లడానికి ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించింది.. దీంతో అభిమానులతో పాటూమీడియా మిత్రులు కూడా వీడియోలు ఫోటోలను తీయడానికి తెగ ఎగబడడమే కాదు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. అయితే ఈ ఫోటోలలో అందరూ గమనించిన విషయం ఏమిటంటే అక్కడ ఐశ్వర్యరాయ్ చేతికి గాయమైనట్టుగా.. ఒక కట్టుతో ఈమె కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అభిమానులు సైతం ఐశ్వర్యరాయ్ కి ఏమయింది.. అంత పెద్ద బ్యాండేజ్ వేసుకుంది అంటూ అభిమానులు కలవర పడుతున్నారు.

- Advertisement -

ఇలా చేతికట్టు తోనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఐశ్వర్యరాయ్ పాల్గొనబోతుందని కామెంట్స్ చేస్తున్నారు.. మరి చేతికి ఏమయ్యింది అనే విషయం పైన ఐశ్వర్యరాయ్ స్పందిస్తుందేమో చూడాలి మరి.. మొత్తానికైతే ఐశ్వర్యరాయ్ ఇలా చేతికి కట్టుతో కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తోంది అయితే ఈ విషయం తెలిసి అభిమానులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి అభిమానుల ఆందోళన తీరాలి అంటే మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్ తన చేతికి తగిలిన గాయం పై స్పందించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఐశ్వర్య ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు