#SSMB29: రాజమౌళి మాస్టర్ బ్రెయిన్ – ఆడియెన్స్ ఫిదా అవ్వాల్సిందే..!

రాజమౌళి ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మగధీర మొదలుకొని బాహుబలి, RRR వంటి భారీ బడ్జెట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయంటే ఆయన ప్లానింగ్ వల్లనే చెప్పాలి. కథ మీద కూర్చున్న సమయం నుండే ఆ కథను ఎలా మార్కెటింగ్ చేయాలి అన్న ప్లాన్ మొదలు పెడతాడు రాజమౌళి. భారీ బడ్జెట్ సినిమాలు తీయటం ఒకెత్తు అయితే వాటిని ఎఫెక్టివ్ గా ప్రమోట్ చేసి లాభాలు రాబట్టటం ఇంకో ఎత్తు. ఈ రెండు పనుల్లో రాజమౌళి మాస్టర్ అని చెప్పవచ్చు. రాజమౌళి పనితనానికి ఉదాహరణగా చాలా అంశాలు చెప్పచ్చు గానీ, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా విషయంలో తాజాగా వినిపిస్తున్న గాసిప్ వింటే ఆయన ప్లానింగ్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే.

వివరాల్లోకి వెళితే, మహేష్ బాబుతో తీయబోయే సినిమాలో హనుమంతుడి తాలుకు షేడ్స్ మహేష్ క్యారెక్టర్ కి జోడించడం వెనుక పెద్ద ప్లానింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. అదేంటంటే, గతంలో ఒకసారి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి ప్రస్తావన వస్తే స్పందించిన మహేష్, బాలీవుడ్ తనని అఫర్డ్ చేయలేదని అందుకే తాను బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక మహేష్ ఆంతర్యం ఏదైనప్పటికీ అది బాలీవుడ్ ఆడియెన్స్ ను నొప్పించింది.

ఈ క్రమంలో మహేష్ పై  నార్త్ ఆడియెన్స్ లో ఉన్న నెగిటివిటీ సినిమాపై ప్రభావం చూపకుండా హనుమంతుడి క్యారెక్టర్ వాడనున్నారని టాక్ వినిపిస్తోంది. నార్త్ ఆడియెన్స్ కి రాముడు, హనుమంతుడు లాంటి మైథలాజికల్ క్యారెక్టర్స్ అంటే ఆసక్తి ప్రేమ ఎక్కువ. RRR లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తే అది రాముడి గెటప్ గా భావించి నార్త్ ఆడియెన్స్ ఆదరించిన తీరే అందుకు నిదర్శనం. ఏదేమైనా ఇంత దూర దృష్టితో ఆలోచించిన రాజమౌళి చతురతకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు