Samantha: “పుష్ప – 2” లో ఐటమ్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన సమంత..!

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధి నుంచి ఈ మధ్యనే బయటపడిన సమంత ప్రస్తుతం తన కెరీర్ ని మళ్ళీ వేగవంతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కీలకపాత్రలో నటించిన “శాకుంతలం” చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో “పుష్ప 2” చిత్రంలో ఐటమ్ సాంగ్ గురించి క్లారిటీ ఇచ్చింది.

అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ నటన ఎంతమందిని ఆకట్టుకుందో.. అంతకుమించి సమంత డాన్స్ కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది. ఒకే ఒక ఐటమ్ సాంగ్ తో అప్పటివరకు చేసిన పాత్రలన్నీ మరిచిపోయేట్లు చేసిన సమంత.మళ్లీ పుష్ప 2 చిత్రంలో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంతకి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో పుష్ప 2 లో తాను ఐటమ్ సాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. “మీరు అడుగుతున్నది జరగదు.. నేను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదు” అని క్లారిటీ ఇచ్చింది సమంత.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు