Vashishta: మెగాస్టార్ నుండి ఆఫర్ – ఇంతలోనే ఇలా..!

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార సినిమాతో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ వశిష్ట. బింబిసార తర్వాత ఆ సినిమాకు పార్ట్ 2 రానుంది అంటూ వార్తలొచ్చాయి కానీ, ఆ సినిమా నుండి వశిష్ట తప్పుకున్నట్టు తెలుస్తుంది. బింబిసార చూసి మెచ్చిన బాలయ్య కూడా వశిష్టకు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా, ఈ యంగ్ డైరెక్టర్ కు మెగాస్టార్ చిరంజీవితో ఫాంటసీ సినిమా ఛాన్స్ వచ్చిందంటూ ఇటీవల వార్తలొచ్చాయి, అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు వశిష్ఠకు. తన ప్రమేయం ఉందొ లేదో తెలీదు గానీ, ట్విట్టర్లో చేసిన పొరపాటుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు వశిష్ట.

వివరాల్లోకి వెళితే, రామ్ చరణ్ మీద ట్రోల్ చేస్తూ వేసిన ఒక పోస్ట్ ను వశిష్ట ట్విట్టర్లో లైక్ చేశారట. దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ మూకుమ్మడిగా ట్విట్టర్లో దాడి చేసేసరికి తన ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేసుకున్నారు డైరెక్టర్ వశిష్ట. సోషల్ మీడియాలో పంచుకున్న అభిప్రాయాల వల్ల సెలెబ్రిటీలు అభిమానుల ఆగ్రహానికి గురవ్వటం ఇది కొత్తేమీ కాదు. గతంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా డైరెక్టర్ శరత్ మండవ నెటిజన్స్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వల్ల వారి ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. అంతే సదరు డైరెక్టర్ గతంలో ట్విట్టర్లో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ గతంలో ట్వీట్లు చేయటం గమనించిన ఇతర పార్టీ అభిమానులు సినిమాను బాయికాట్ చేయాలంటూ ట్విట్టర్లో ట్రెండ్స్ కూడా చేశారు.

అయితే మెగాస్టార్ తో సినిమా చేయబోతున్న వశిష్ట ఇప్పుడు జరిగిన వివాదంపై ఏమైనా స్పందిస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ ధాటికి ట్విట్టర్ అకౌంట్ లాక్ చేసిన వశిష్ట తిరిగి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి. మరో పక్క ఈ వివాదం ప్రభావం చిరంజీవి వశిష్టల కాంబినేషన్ పై ప్రభావం చూపుతుందా అని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు