NTR: తాత కోరిక మనవడు తీర్చేశాడా.. డైరెక్టర్ తో ఏమన్నారంటే..?

NTR.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోలలో ఒకరిగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన ఈయన ఇప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడమే కాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.. ఇదిలా ఉండగా సీనియర్ ఎన్టీఆర్ తన మనవడి విషయంలో ఒక కోరికతో ఉండేవారట.. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు వెల్లడించారు…

సీనియర్ ఎన్టీఆర్ కోరిక..

NTR: Grandfather's wish fulfilled by the grandson.. What is the matter with the director..?
NTR: Grandfather’s wish fulfilled by the grandson.. What is the matter with the director..?

ఇక సీనియర్ ఎన్టీఆర్ కోరిక ఏమిటంటే.. తన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా చూడాలని.. ఈయన ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకున్నారట సీనియర్ ఎన్టీఆర్.. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేయాలని సీనియర్ ఎన్టీఆర్ అనుకున్నప్పుడు.. రాఘవేంద్రరావును పిలిచి.. తన మనవడు తారక్ ను హీరోగా నిలబెట్టాలని తనతో ఒక సందర్భంలో చెప్పారని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.. ఇక రాజమౌళి పనితనం తెలిసి ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను ప్లాన్ చేయడం జరిగిందని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు..

తాత కోరికను తీర్చిన మనవడు..

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అటు ఎన్టీఆర్ కి ఇటు రాజమౌళికి ఇద్దరికీ కలిసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో రాఘవేంద్రరావు కామెంట్ల ద్వారా మనకు అర్థమవుతుంది.. మొత్తానికి అయితే తాత అనుకున్న కోరికను నెరవేర్చుతూ స్టార్ హీరో నే కాదు ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్..

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా దూసుకుపోతున్నారు.. ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఇక మొదటి భాగంపై ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను పెంచుతూ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు శివ కొరటాల.. ఇక ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ.. మొదటిసారి తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇ ఈ సినిమా గనుక సక్సెస్ అయితే జాన్వీ కపూర్ కెరియర్ పరంగా వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు..

తల్లి కోరికను తీర్చిన జాన్వీ కపూర్..

మరోవైపు జాన్వీ కపూర్ కూడా బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్సి16 సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులో కూడా ఈమె పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారని సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.. మరోవైపు జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి కి కూడా ఒక కోరిక ఉండేదట.. తన కూతురు జాన్వీ కపూర్ తెలుగులో సినిమా చేస్తే అది సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తోనే చేయాలని ఆమె కలలు కందట. ఇక ఆమె కళ్ళను నెరవేర్చడానికి జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తోంది.. మొత్తానికైతే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారి అటు తాత కలను.. జాన్వీ మొదటిసారి తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి నటించి..తన తల్లి కోరికను.. అలా ఇద్దరూ నెరవేర్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు