Star Movie : ఇక్కడి వచ్చిన నష్టాన్నీ, అక్కడ కవర్ చేసుకుంటున్న తెలుగు నిర్మాత..!

Star Movie : టాలీవుడ్ లో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలిచ్చిన ఘనత భోగవల్లి ప్రసాద్ కే దక్కింది. ఇక గత ఏడాది విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ నిర్మాత, అదే ఏడాది గాండీవదారి అర్జున మూవీ తో డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా పరాజయం భారీ నష్టాలని మిగిల్చింది. అయితే నిర్మాత భోగవల్లి ప్రసాద్ లాస్ట్ ఇయర్ “అశ్విన్స్” అనే సినిమాతో నిర్మాతగా లాస్ట్ ఇయర్ కోలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం పరాజయం పాలయింది. అయితే తాజాగా “స్టార్” అనే సినిమాని రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా తమిళంలో నిర్మించారు. శ్రీనిధి సాగర్ ఈ చిత్రానికి మరో నిర్మాత. కాగా మే 10న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది.

Producer BVSN Prasad got a super hit in Tamil with Star Movie

ఇక్కడి నష్టాన్ని అక్కడ కవర్ చేసుకుంటున్నారు..

ఇక స్టార్ సినిమా ఎలన్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ సినిమాలో కెవిన్ లీడ్ రోల్ లో నటించారు. తాజాగా రిలీజ్ అయిన “స్టార్” మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అక్కడి జనాలు యునానమస్ గా సినిమాకి హిట్ టాక్ ఇచ్చేశారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడం విశేషం. చిన్న సినిమాగా వచ్చినా తమిళ్ ఆడియన్స్ కి స్టార్ మూవీ విపరీతంగా కనెక్ట్ అయ్యింది. చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనే డ్రీం ఉన్న ఓ యువకుడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి చేసిన ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో కావాల్సినంత వినోదం ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఇక యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. 12 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ బట్టి లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 10 కోట్లు వసూలు చేయగా, వారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

- Advertisement -

త్వరలో తెలుగులో డబ్..

ఇక తమిళ్ లో మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న స్టార్ (Star Movie) సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా తో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తక్కువ పెట్టుబడి పెట్టి భారీ లాభాలు అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక స్టార్ మూవీకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, తెలుగులో కూడా అతనే రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న “జాక్” సినిమా, అలాగే అఖిల్ హీరోగా ఓ సినిమా రానున్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు