Jack : టిల్లు గాని వల్ల అమాంతం పెరిగిపోయిన జాక్ బడ్జెట్..

Jack : టాలీవుడ్ లో లాస్ట్ మంత్ భారీ అంచనాలతో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమా తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ మార్కెట్ వాల్యూ ఓ రేంజ్ లో పెరిగిపోయిందని చెప్పాలి. రెండేళ్ల కింద సిద్ధూ జొన్నలగడ్డ ఓ మామూలు చిన్న సినిమాలు, కామెడీ ఎంటర్టైనర్ లు చేసుకునే హీరో. నిజానికి సిద్ధూ జొన్నలగడ్డ గురించి సిటీ ఏరియాల్లో తప్ప రూరల్ ఏరియాల్లో ఈ హీరో గురించి విన్న సందర్భాలు తక్కువే. కానీ ఎప్పుడైతే డీజే టిల్లు సౌండ్ మోగిందో అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ డీజే సౌండ్ పెట్టిన ఈ టిల్లుగాని పాటలు లేకుండా మ్యూజిక్ ఉండేది కాదు. ఒక చిన్న ఆర్టిస్ట్ గా సైడ్ రోల్స్ చేసుకుంటూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ అనే కామెడీ సినిమాతో బ్రేక్ ఇచ్చాడు. అయితే సిద్ధూ కెరీర్ ని మార్చిన డీజే టిల్లు ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఏకంగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడని చెప్పొచ్చు.

టిల్లు గాని వల్ల జాక్ కి హై డిమాండ్..

అయితే సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ సినిమాల డిమాండ్ మారిపోయింది. ఈ సినిమా భారీ విజయం వల్ల సిద్ధూ జొన్నలగడ్డ తదుపరి సినిమాలపై ఆసక్తిని పెంచేలా చేసింది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్(Jack) అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బయ్యర్లు ఇప్పటినుండే ఎగబడుతున్నారట. ఈ సినిమాను SVCC బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ వచ్చింది. టిల్లు స్క్వేర్ తర్వాత ఈ సినిమాకి “జాక్” పాట్ తగిలిందని చెప్పాలి. టిల్లు స్క్వేర్ జోరు వల్ల సిద్ధూ జొన్నలగడ్డ మార్కెట్ పెరగగా, జాక్ కి అన్ని ఏరియాల నుంచి మునుపటికంటే భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా ఇప్పుడు లిమిట్స్ దాటిపోతుందట.

పరిమితిని మించి బడ్జెట్..

అయితే జాక్ సినిమా అనుకున్నదానికంటే బడ్జెట్ ఇప్పుడు పెరిగిపోతోందట. రెండు నెలల ముందు వరకు సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే ఉండగా, టిల్లు స్క్వేర్ రిలీజ్ తర్వాత సినిమా బడ్జెట్ 30 కోట్లు దాటిపోయిందట. ఇక సిద్ధూ జొన్నలగడ్డ మార్కెట్ కూడా పెరగడంతో నిర్మాత కూడా పెట్టడానికి రెడీ అయ్యాడు. కానీ డైరెక్టర్ ఇప్పుడు మరింత రిచ్ క్వాలిటీతో తీద్దామని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎలాంటి టీజర్ గాని, సాంగ్స్ గాని రాలేదు కానీ, సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 70 శాతం పెరిగిపోయిందట. అయితే ఈ సినిమా పాటలకు బొమ్మరిల్లు భాస్కర్ తన స్టయిల్ల్లో భారీగా ఖర్చు చేయనున్నాడట. ఇక మూవీ రిలీజ్ టైం కి జాక్ బడ్జెట్ దాదాపు 40 కోట్ల వరకు వెళ్లొచ్చని టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా కంటెంట్ బాగుంటే వసూళ్లకు డోకా ఉండదు గాని, కథ విషయంలో దెబ్బేస్తే నిర్మాతే నష్టపోతాడని నెటిజన్లు అంటున్నారు. ఇక జాక్ సినిమా టీజర్ ఎప్రిల్ చివరివారంలో రానుందట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు