Game changer : మళ్ళీ లీక్.. ఈ సారి స్టోరీయే బయటపెట్టేసేలా ఉన్నారే?

Game Changer : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ఆ హీరోల సినిమాల నుండి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషిలో ఉంచుతున్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం రెండేళ్లుగా బాగా డల్ అయ్యారు. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇప్పటివరకు రాలేదు. ఆచార్య లో స్పెషల్ అప్పీరెన్స్ కాగా, అది కూడా ఆ టైం లోనే రిలీజ్ అయింది. అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ మాత్రం ఏకంగా మూడేళ్ళుగా తెరకెక్కుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్, ఒక సాంగ్ తప్ప ఏమి రాలేదు. అయితే షూటింగ్ ఇంత లేట్ కావడానికి రీజన్, ఈ సినిమాని పక్కన పెట్టి ఇండియన్ 2 ని చేయడమే అని అందరికి తెలిసిందేగా. అయితే ఈ సినిమా నుండి లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. మంచి మంచి క్రేజీ సీన్ల స్టిల్స్ మొత్తం లీక్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ తగ్గేలా చేస్తున్నాయి.

అన్నీ లీకులే.. ఇప్పుడు ఏకంగా స్టోరీనే..

అయితే సినిమా అప్డేట్స్ సంగతి ఎలాగున్నా గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా నుండి లీకుల బెడద మాత్రం తప్పట్లేదు. గేమ్ ఛేంజర్ మొదలనప్పుడు ఒక సాంగ్ లీక్ వీడియో మొదలుకొని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టిల్స్, రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన కీలక ఎలక్షన్ సన్నివేశాల లీక్స్ వల్ల ఫ్యాన్స్ కి అప్పటికప్పుడు కిక్కెక్కిస్తున్నా, ఆ తర్వాత లీక్ అవుతున్నందుకు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలా లీక్ అవుతూ పోతే సినిమాపై ఉన్న అంచనాలు మొత్తం మాయమవుతాయి. అయితే తాజాగా మరో లీక్ వచ్చేసింది. ఈ సారి స్టిల్స్ గాని వీడియో కానీ, కాకుండా ఏకంగా స్టోరీ నే లీక్ అయిందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఏకంగా 1000 మందితో ఫైట్ చేయబోతున్నాడట. ఇక ఈ ప్రీ-క్లైమాక్స్ పోరు లో ఇంటర్నేషనల్ మూవీ స్టాండర్డ్ రేంజ్ లో ఉంటుందట. ఓ హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్‌లతో ఈ ఫైట్ ని చిత్రీకరిస్తున్నారట. అది కూడా శంకర్ స్టయిల్ల్లో రియలిస్టిక్ గా ఆ సన్నివేశం ఉంటుందట. ఆల్మోస్ట్ RRR లో చరణ్ ఇంట్రో సీన్ లాగే అనుకోవచ్చు. సినిమాకి హైలెట్ అయ్యే సీన్లలో అదొకటి అని టాక్.

ముగింపు దశకు షూటింగ్..

అయితే ఇలా క్రేజీ అనిపించే సీన్లన్నీ లీక్ చేసేస్తూ ఉంటే ఎలా అని నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని తాజా సమాచారం. రిలీజ్ డేట్ ని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు మేకర్స్. పైగా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని దిల్ రాజు అంటూనే, శంకర్ నుండి కన్ఫర్మేషన్ రాగానే రిలీజ్ డేట్ ప్రకటించేస్తామని అంటున్నాడు. కానీ శంకర్ నోట మాత్రం గేమ్ ఛేంజర్ ప్రస్తావన రావడం లేదు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మేకర్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చరణ్ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు