Game Changer : చరణ్ అభిమానులకు కిక్కెకించే అప్డేట్..?

Game Changer :టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఒక క్లారిటీ తో ఉన్నారు. అందులో కొందరి అభిమాన హీరోల సినిమాలు ఇప్పటికే రిలీజ్ కావడం జరిగిపోగా, మరి కొందరి సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని రావడానికి రెడీ అవుతున్నాయి. కొందరు లేట్ గా వస్తున్నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషిలో ఉంచుతున్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం రెండేళ్లుగా బాగా డల్ అయ్యారు. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇప్పటివరకు రాలేదు. ఆచార్య లో స్పెషల్ అప్పీరెన్స్ కాగా, అది కూడా అప్పట్లోనే రిలీజ్ అయింది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం దర్శకత్వం లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ ఏకంగా మూడేళ్ళుగా తెరకెక్కుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్, ఒక్క సాంగ్ తప్ప ఏమి రాలేదు. వాటికి కూడా ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. ఎందుకంటే ఆ లుక్ కానీ, సాంగ్ గాని అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అయితే షూటింగ్ ఇంత లేట్ కావడానికి రీజన్ శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టి ఇండియన్ 2 ని చేయడమే అని అందరికి తెలిసిందేగా. ఏదైతేనేమి ఎట్టకేలకు ఇండియన్ 2 షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.

ఆ రోజున గేమ్ ఛేంజర్ ?

అయితే సినిమా అప్డేట్స్ సంగతి ఎలాగున్నా గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు మేకర్స్. పైగా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని దిల్ రాజు అంటూనే, శంకర్ నుండి కన్ఫర్మేషన్ రాగానే రిలీజ్ డేట్ ప్రకటించేస్తామని దిల్ రాజు అంటున్నాడు. కానీ శంకర్ నోట మాత్రం గేమ్ ఛేంజర్ ప్రస్తావన రావడం లేదు. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఇండియన్ 2 రిలీజ్ అప్డేట్ మాత్రం వచ్చేసింది. రిలీజ్ డేట్ చెప్పకపోయినా, జూన్ లో రిలీజ్ అవుతుందని చెప్పేసారు మేకర్స్. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మేకర్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చరణ్ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాలి. బహుశా ఉగాది స్పెషల్ గా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

వెకేషన్ నుండి సెట్స్ లోకి చెర్రీ!

ఇక తాజాగా రామ్ చరణ్ ఫ్యామిలీ తో కలిసి థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్లగా, అక్కడ నుండి వచ్చిన రామ్ చరణ్, తిరిగి గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక తదుపరి షెడ్యూల్ రాజమండ్రిలో ఉండబోతుందట. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఇక ఈ షెడ్యూల్ తో మూవీ కి సంబంధించిన తొంభై శాతం సినిమా పూర్తవుతుందట. అయితే శంకర్ సినిమాలకు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఇక రామ్ చరణ్ ఈ సినిమా తరవాత బుచ్చిబాబు RC16 తో బిజీ అవుతున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఆ తర్వాత సుకుమార్ చరణ్ కాంబోలో సినిమా ఉంటుంది. అయితే ఇది వచ్చే ఏడాదే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ లోపు పుష్ప ది రూల్ రిలీజ్ చేస్తాడు సుకుమార్.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు