Vettaiyin : అరవోళ్లకి ఇదేం ట్రెండో? సగం ఊరించడం?

Vettaiyin : కోలీవుడ్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు విడుదల తేదీలు ఒక్కొక్కటిగా ఫిక్స్ అవుతున్నాయి. అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు వరుస బెట్టి షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇక సూర్య, ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఫినిషింగ్ స్టేజి కి చేరుకున్నాయి. అయితే సీనియర్ స్టార్ హీరోల పరిస్థితి వేరేలా ఉంది. అక్కడి సీనియర్ స్టార్స్ సినిమాలంటే ఇప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ మాత్రమే అని తెలిసిందే. ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఎప్పుడు వచ్చినా యంగ్ హీరోల సినిమాలని మించి ఫ్యాన్స్ హడావిడి చేస్తారు. మూవీ అనౌన్స్ మెంట్స్ నుండి, సినిమాల రిలీజ్ డేట్ వరకు, టీజర్ రిలీజ్ నుండి, సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు సోషల్ మీడియా లో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. కానీ ఈ సీనియర్ స్టార్స్ సినిమాల నుండి వచ్చిన కొత్త రిలీజ్ అప్డేట్స్ ఫ్యాన్స్ కి సగం ఆనందాన్ని ఇచ్చి సగం సందిగ్ధతలో పడేశాయి.

రజిని కమల్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్..!

ఇక అసలు విషయానికి వస్తే.. లోకనాయకుడు కమల్ హాసన్ ఎన్నో రోజులుగా శంకర్ ఇండియన్ 2(Indian2) సినిమా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించగా ఫ్యాన్స్ ని సగం మాత్రమే ఖుషి చేసారు. ఇండియన్2 జూన్ లో రిలీజ్ అవుతుందని మాత్రమే ప్రకటించి రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు ఇలాగే చేసారు మేకర్స్. తాజాగా టీజె. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న’వెట్టయన్'(Vettaiyin) విడుదల తేదీ ప్రకటన వచ్చింది. అయితే ఇది కూడా ఇండియన్ 2 లాగానే విడుదల తేదీ కాకుండా అక్టోబర్ నెలలో విడుదల అని మాత్రమే ప్రకటించడం జరిగింది. విడుదల తేదీని మాత్రం ప్రకటించడం లేదు. దీంతో రజిని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సరిగా ట్రెండ్ కూడా చేయలేకపోతున్నారు.

రెండిటికి ఒకే నిర్మాత.. అంటే అతని నిర్ణయమేనా?

అయితే కమల్ హాసన్ ఇండియన్ 2, రజనీకాంత్ వెట్టయిన్ సినిమాలను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మాత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. కాకపోతే ఇండియన్ 2 లో ఉదయనిధి స్టాలిన్ కూడా సహ నిర్మాత గా ఉన్నాడు. అయితే వెట్టయిన్, ఇండియన్ 2 సినిమాల ఈ రిలీజ్ మంత్ అప్డేట్ల నిర్ణయం నిర్మాత డెసిషనా? లేక మూవీ టీం కలిసి తీసుకుందా అన్న అనుమానం ఫ్యాన్స్ కి వస్తుంది. ఇదిలా ఉండగా ఇలా రిలీజ్ డేట్ కాకుండా మంత్ ని మాత్రమే ప్రకటించి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం ఏంటి? కోలీవుడ్ వాళ్లకి ఇదేం ట్రెండ్ అని టాలీవుడ్ నెటిజన్లు కామన్స్ చేస్తున్నారు. అయితే తెలుగులో కూడా ఇలా రిలీజ్ మంత్ లని పెద్ద సినిమాలకి ప్రకటిస్తారు. కానీ అది మూవీ ప్రారంభమైన కొత్త లో ఈ టైం కల్లా వస్తుందని రఫ్ గా అంచనా వేసి అనౌన్స్ చేస్తారు. మరి ఈ అరవ సినిమాలను డేట్లతో సహా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో?

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు