Ram – Sharwanand: కుర్ర హీరోల మధ్య విభేదాలా..?

Ram – Sharwanand..సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో నైనా నటీనటుల మధ్య గట్టి పోటీ ఉంటుంది.. కొంతమంది హీరోలు సైతం అందరితో కలిసిపోయి మరి కనిపిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవరికి వారు యమునా తీరే అనే అంతలా ప్రవర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమాల విషయంలో సక్సెస్ అయితే ఇతర హీరోలు కూడా ఫుల్లుగా ఫీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది.. అందుకని చాలామంది హీరోలు ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకుంటూనే ముందుకు వెళుతుంటారు..

రామ్ – శర్వా మధ్య మాటలు లేవా..
అయితే మరి కొంతమంది స్టార్ హీరోలు మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా చాలామంది హీరోలతో చాలా సన్నిహితంగా ఉంటూ ముందుకు వెళుతుంటారు.. దీనివల్ల ప్రేక్షకులలో కూడా మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు. అందుకే స్టార్ హీరోల స్నేహాన్ని తెలియజేసేలా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా భారీ మల్టీ స్టారర్ చిత్రాలు విడుదలవుతూ ఉన్నాయి.. ఇదిలా ఉండగా మరోవైపు టాలీవుడ్ లో ఇద్దరు యంగ్ హీరోస్ మధ్య మాటలు లేవనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆ హీరోలు ఎవరో కాదు హీరో శర్వానంద్, రామ్ పోతినేని..

వీళ్ళిద్దరూ బంధువులే..
ముఖ్యంగా వీరిద్దరు బావ బామ్మర్దుల అవుతారనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ ఇప్పటికీ వీళ్ళు ఎలాంటి ఫంక్షన్ లో కానీ ఏ పార్టీలో కానీ కనిపించలేదు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ మధ్య ఏదో చిన్నపాటి గొడవైతే ఉందని.. అందుకే వీరిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలిసి కనిపించరని తెలుస్తోంది. మరి ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ ఇప్పుడు వినిపిస్తున్న కథలను బట్టి చూస్తే కచ్చితంగా వీరిద్దరి మధ్య ఏదో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉందని కనిపిస్తోంది.

- Advertisement -

రామ్ – శర్వా మళ్లీ కలుస్తారా..
అందుచేతనే రామ్, శర్వానంద్ ఇద్దరూ కూడా ఒకరినొకరు అంతగా పట్టించుకోరని.. చాలా స్పష్టంగా కనిపిస్తోంది.. మొత్తానికి వీరిద్దరు ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హీరో శర్వానంద్ వివాహమై ఇటీవలే ఒక పాపకు తండ్రి కూడా అయ్యారు. హీరో రామ్ ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్ గా తన జీవితాన్ని గడిపేస్తూ వరుస సినిమాలతో బిజీగా ముందుకు వెళుతున్నారు. మరి రాబోయే రోజుల్లో శర్వానంద్, రామ్ పోతినేని ఏదైనా సినిమాలలో కలసి నటించి ఇలాంటి రూమర్స్ కు చెక్ పెడతారేమో చూడాలి మరి.

రామ్ పోతినేని సినిమాలు..
ఇక ప్రస్తుతం రాం పోతినేని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అయితే బయటకు రాలేదు మరి ఒకేసారి సినిమాను రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తారేమో చూడాలి..

శర్వానంద్ సినిమాలు..
చివరిగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ పర్వాలేదు అనిపించుకున్నారు.. ఇప్పుడు మనమే అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.. మరి ఎప్పుడు ఏ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు