Hanu Raghavapudi : ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ తో హను సినిమా?

Hanu Raghavapudi : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి2898AD”. ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గానే కాదు ఇంటెర్నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తుండడం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీ బ్యానర్ వారు నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో నేషనల్ వైడ్ గా సాలిడ్ క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ పాత్ర పేరు “భైర‌వ” అని సినిమాలో క్యారెక్ట‌ర్ నేమ్ రివీల్ చేస్తూ అప్పట్లో ఓ లుక్ వదిలారు మేకర్స్. ఇక సినిమాని మే 30న రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభాస్ దీని తర్వాత చేయబోయే సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రభాస్ కోసం ఒక్కసారిగా నలుగురు డైరెక్టర్లు కాసుకు కూర్చుని ఉన్నారు. అయితే అందులో ముందుగా మారుతి తో చేస్తున్న రాజా సాబ్ సినిమానే పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నందువల్ల తొందరగా ఫినిష్ అవుతుంది.

హను రాఘవాపుడితో ప్రభాస్ సినిమా..

అయితే ప్రభాస్ మారుతి సినిమా తర్వాత సందీప్ తో స్పిరిట్, లేదా, ప్రశాంత్ నీల్ తో శౌర్యంగ పర్వం మొదలుపెడతాడు. అయితే అది ఆ దర్శకుల తదుపరి సినిమాలని బట్టి కూడా ఉంటుంది. అయితే వీరి తర్వాత ప్రభాస్ హనురాఘవపుడి (Hanu Raghavapudi) తో సినిమా ఉంటుంది. ఇక ఈ కాంబోపై కూడా చాలా క్రేజీ అంచనాలున్నాయి. టాలీవుడ్ లో మంచి అభిరుచి గల దర్శకుల్లో హనురాఘవపుడి ఒకరు. సీతారామం వంటి అద్భుతమైన సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హను తర్వాత చేయబోయే సినిమాపై కూడా చాలా ఆసక్తి నెలకొని ఉంది. అయితే హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా ప్రభాస్ తో తీయబోయే సినిమా గురించి తాజా సమాచారం వచ్చింది. హను రాఘవపూడి ప్రభాస్ తో తీయబోయే సినిమా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట. అది కూడా తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం.

ఇప్పటికే మ్యూజిక్ పనులు స్టార్ట్..

ఇక ప్రభాస్ హను సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందించబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు పాటలని సిద్ధం చేసాడని సమాచారం. ఇక ప్రభాస్ తో చేయబోయే ఏ పీరియాడిక్ యాక్షన్ డ్రామా పై పలువురు చారిత్రక కళాకారులతో కథ డెవలప్మెంట్ పై చర్చలు కూడా జరుపుతున్నాడట హను రాఘవపూడి. ఇదిలా ఉండగా ప్రభాస్ కల్కి2898 AD సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి వచ్చేయగా, త్వరలో సినిమా ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సినిమా అలా రిలీజ్ కాగానే మారుతీ సినిమాలో ప్రభాస్ నిమగ్నమవుతాడు. ఇక ప్రభాస్ హను సినిమా జూన్ లేదా, జులై లో ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు