Kavya Kalyanram: పెళ్లి చేసుకోబోతున్న బలగం బ్యూటీ !?

Kavya Kalyanram: టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది అన్న సంగతి తెలిసిందే. అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే గ్లామర్, టాలెంట్ తో పాటు ఎక్స్ట్రా టాలెంట్ కూడా ఉండాలి. అలాంటి వాళ్లే ఇండస్ట్రీలో పాతుకుపోతారు. ఇక విషయానికి వస్తే…. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ లో ఓ ఊపు ఊపారు. రీసెంట్ గా హిట్ అయిన లో బడ్జెట్ మూవీ “బలగం”.

హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కి కూడా లక్కు బాగానే కుదిరింది. ఇందులో సంధ్య పాత్రలో గ్లామర్ కి స్కోప్ లేని పాత్రలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్గా మారింది. “మసూద్” సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. కావ్య కళ్యాణ్ రామ్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన “బలగం” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్.

“బలగం” సినిమా సూపర్ హిట్ అవడంతో కావ్యకు మంచి గుర్తింపుతో పాటు క్రేజీ ఆఫర్స్ కూడా క్యూ కట్టాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో “గంగోత్రి” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ సుందరి. ఠాగూర్ సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పిల్లి కళ్ళ సుందరి. ఆ తర్వాత “స్నేహమంటే ఇదేరా”, “అడవి రాముడు”, “విజయేంద్ర వర్మ”, “సుభాష్ చంద్రబోస్”, “పాండురంగడు” వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. “బాలు” సినిమాలో కూడా మెప్పించింది.

- Advertisement -

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది కావ్య కళ్యాణ్ రామ్. ఇటీవలే రిలీజ్ అయిన “బలగం” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కవ్వింపులతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది కావ్య కళ్యాణ్ రామ్. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ డోస్ పెంచేస్తోంది. వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల “ఉస్తాద్” మూవీలో నటించింది. కాగా… తాజాగా నగలు వేసుకొని పెళ్లికూతురుల మెరిసింది కావ్య. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు