Aavesham : ఆ మలయాళ సినిమా రీమేక్ కి బాలయ్యే పర్ఫెక్టట?

Aavesham : టాలీవుడ్ లో ఈ మధ్య తెలుగులో సరైన సినిమా రావట్లేదని టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఇతర భాషల సినిమాల కోసం ఎగబడుతున్నారు. ముఖ్యంగా మలయాళం సినిమాల కోసం తెలుగు సినీ ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. రీసెంట్ గా డబ్ అయిన ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ వంటి సినిమాలను తెలుగులోనూ మూవీ లవర్స్ ఎంతగానో ఆదరించారు. ఇక భ్రమయుగం, ఆడు జీవితం లాంటి సినిమాలని కూడా తెలుగులో ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ బాగా చూసారు. ఇక తాజాగా మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్ హీరోగా నటించిన కొత్త సినిమా ఆవేశం మలయాళంలో ఓ రేంజ్ లో దుమ్ములేపుతుంది. మలయాళంలో ఫస్ట్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో ఇరగదీస్తోంది. అయితే ఒక్క కేరళలోనే కాదు. తెలుగు డబ్బింగ్ చేయకపోయినా, హైదరాబాద్ లో ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారట. అయితే ఈ సినిమాని మళయాళంతో పాటు తెలుగులో కూడా ముందే రిలీజ్ చేయాల్సి ఉండగా, సినిమా ఫలితం చూశాక తెలుగు రిలీజ్ నిర్ణయించాలని నిర్మాతలు భావించడంతో మన దాకా రాలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా రీమేక్ కి తెలుగులో ప్రయత్నాలు జరుగుతున్నాయట.

బాలయ్యే ఆ పాత్రకి పర్ఫెక్ట్..

ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా ఇప్పటీకే మలయాళంలో 80 కోట్లకి పైగా వసూల్ చేసి వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇక ఆవేశం (Aavesham) సినిమా విషయానికి వస్తే ఇందులో హీరో పాత్ర పేరు రంగా. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు తమ సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారంతో రగిలిపోయి, సహాయం కోసం నగరంలో రౌడీగా చెలామణిలో ఉన్న రంగాను కలుస్తారు. అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం అనూహ్య మలుపులు తిరుగుతుంది. అయితే సినిమా మొత్తం ఫహద్ ఫాజిల్ వన్ మ్యాన్ షో గానే ఉంటుంది. సినిమా చూసిన మూవీ లవర్స్ లో ఫహద్ లోని కొత్త కోణం చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమా కథ నేపథ్యం సీరియస్ డ్రామా అయినా, ఆద్యంతం నవ్విస్తూ, ఎమోషన్స్ కి గురి చేస్తూ, థ్రిల్ పంచుతుంది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో నందమూరి బాలకృష్ణ పర్ఫెక్ట్ అవుతాడని తెలుగులో రీమేక్ చేసేద్దామని ఓ బడా నిర్మాత ప్లాన్ చేస్తున్నాడట.

ఆ ఒక్క విషయంలోనే డౌట్..

అయితే ఆవేశం మూవీ స్టోరీ లైన్ చూసుకున్నా, క్యారెక్టర్ పరంగా చూసుకున్నా బాలయ్య పర్ఫెక్ట్ అని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా అంటున్నారు. కానీ ఆవేశం లో ఫహద్ పాత్ర పేలడానికి అతని స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన కామెడీ కూడా కారణం. కేవలం తన హావా భావాలతోనే ఫన్ జెనెరేట్ చేసాడు. అయితే బాలయ్య లో రౌద్ర రసాల్ని ఎక్కువగా చూసిన ఫ్యాన్స్ కామెడీని చూడగలరా అని కొందరు నెటిజన్ల అభిప్రాయం. ఎమోషన్స్ లో కూడా బాలయ్యని కొట్టేవాడు లేరెమో కానీ, కామెడీ అంటే కొంచెం ఆలోచించాలి అని అంటున్నారు. బహుశా తెలుగు దర్శకులు చిన్నపాటి మార్పులు చేసి బాలయ్య మేనరిజానికి అనుకూలంగా స్క్రిప్ట్ ని మార్చొచ్చేమో? ఏది ఏమైనా ఆవేశం సినిమా రీమేక్ రైట్స్ కోసం మాత్రం పలువురు తెలుగు నిర్మాతలు ఎగబడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు