Kalki2898AD : ‘సమయం వచ్చింది’.. ఆరోజున సన్యాసి దర్శనం..

Kalki2898AD : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజి చిత్రాల్లో ఒకటైన కల్కి2898AD మూవీ పై పాన్ ఇండియా వ్యాప్తంగా ఏ రేంజ్ లో అంచనాలున్నాయో తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి మహానటులు కూడా భాగమవడంతో ఇండియన్ సినిమాల్లోనే ఈ సినిమా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అందరూ అంటున్నారు. ఇక రెండేళ్లుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్, టీజర్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలను పెంచేసాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ఇక టాలీవుడ్ హల్క్ రానా ఈ సినిమాని దగ్గరుండి హాలీవుడ్ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కల్కి సినిమా నుండి సడన్ గా అద్దిరిపోయే అప్డేట్ వచ్చేసింది.

ఎట్టకేలకు అమితాబ్ ఫస్ట్ లుక్..

అయితే కల్కి2898AD మూవీ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కళ్ళత్ కూడిన ఫస్ట్ లుక్ తప్ప మరేది రిలీజ్ చేయలేదు. ఇక ఎప్పటి నుంచో ఈ చిత్రంలో అమితాబ్ లుక్, పాత్ర స్వ‌భావం గురించి తెలుసుకోవాల‌ని దాని వివరాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి క్యూరియాసిటీకి త‌గ్గ‌ట్టుగానే, ఈ సినిమా నుంచి స‌రికొత్త పోస్టర్ ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం సహా వివిధ భాషలలో కాసేపటికిందే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ పూర్తిగా తెల్లటి దుస్తులు ధరించి ఒక ఆలయం లోపల కూర్చుని, ప్రకాశవంతమైన కాంతి కిరణం వైపు చూస్తూ క‌నిపించారు. ఈ పోస్ట‌ర్ లో అమితాబ్ రూపాన్ని చూడ‌గానే ఆయ‌న ఆయన ఒక స‌న్యాసి అని అర్థ‌మ‌వుతోంది. ఇక ఆ ఆల‌య ప్రాంగ‌ణం సాలె గూళ్ల‌తో ఉండగా అత్యంత పురాత‌న‌మైన‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ పోస్ట‌ర్ లో కూడా కేవ‌లం బిగ్ బి క‌ళ్లు మాత్ర‌మే పోస్ట‌ర్ లో క‌నిపిస్తున్నాయి. ఇత‌ర శ‌రీర భాగాలేవీ క‌నిపించ‌కుండా ధ‌రించిన ఆ దుస్తులతో క‌వ‌ర్ చేసి ఉన్నాయ్. అస‌లు ఆ సన్యాసి ఎవరా అన్న ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది 21 ఏప్రిల్ అంటే ఆదివారం సాయంత్రం 7.15 PM కి రివీల్ కానుంది.

ఇక నుండి రెగ్యులర్ గా ప్రమోషన్..

ఇక తాజాగా రిలీజైన కల్కి2898AD పోస్ట‌ర్ అమితాబ్ బచ్చన్ కి సంబంధించి పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అవుతుంది. త్వరలో వెలువ‌డ‌నున్న‌ భారీ ప్రకటన కోసం నిరీక్షణను పెంచింది. ఇక రిలీజ్ అయిన పోస్టర్‌లో “సమయం వచ్చింది” అని పలు భాషల్లో రాసి ఉంది. కల్కి 2898 AD గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌ లో సంచలనాత్మక అరంగేట్రం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. క‌ల్కి 2898 AD చాలా భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఇది భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండ‌బోతోందో ఆవిష్క‌రించే చిత్ర‌మ‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. ఇక రేపు రానున్న అమితాబ్ ఫస్ట్ లుక్ తర్వాత మూవీ నుండి రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ చేయనున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు