30YearsForHelloBrother : 3 దశాబ్దాల హలో బ్రదర్.. నాగ్ లోని మరో కోణం..

30YearsForHelloBrother : టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల్లో కింగ్ నాగార్జున క్రేజే వేరన్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన మార్కెట్ పడిపోయినా, ఒకప్పుడు నాగార్జున సినిమా అంటే చాలు ఏదో ఒక స్పెషలిటీ ఉంటుందనే వారు. ముఖ్యంగా 90స్ లో ప్రయోగాలకు కేరాఫ్ గా నాగార్జున నిలిచేవారు. ఇక అసలు విషయానికి వస్తే.. నాగార్జున స్టార్ హీరోగా యంగ్ హీరోల్లో నిలదొక్కుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోజులవి. తన సినిమాలతో అన్ని రకాలుగా మెప్పించిన నాగార్జున శివ, గీతాంజలి వంటి సినిమాలతో అప్పట్లో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. అయినా ఏదో ఒక వెలితి. నాగార్జున నుండి ఇంకేదో కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అప్పుడొచ్చింది హలో బ్రదర్. నాగార్జున నుండి ఫ్యాన్స్ ఏం మిస్సయ్యారో గుర్తు చేస్తూ, నాగ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ రచ్చ చేసిన సినిమా ఇది. 1994 ఎప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా నేటికి సరిగ్గా 30 వసంతాలు (30YearsForHelloBrother) పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా కింగ్ నాగ్ లోని కామెడీ యాంగిల్ ని పండించి ఫ్యాన్స్ కి హాట్ ఫెవరేట్ గా నిలిచిన హలో బ్రదర్ గురించి కొన్ని ముచ్చట్లు తెలుసుకుందాం.

నాగ్ లోని కామెడీ యాంగిల్..

అయితే టాలీవుడ్ లోగాని, ఇతర ఇండస్ట్రీలలో గాని స్టార్ హీరోలు కామెడీ క్లాసిక్స్ చేస్తే ఆ కిక్కే వేరు. చిరంజీవికి చంటబ్బాయ్, అన్నయ్య, వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఎలాగో, నాగార్జున కు హలో బ్రదర్ అలాంటి ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. అప్పటికే వారసుడుతో తనకో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఈవివి సత్యనారాయణ తీసుకొచ్చిన కథను విని కెరీర్ లో మొదటిసారి డ్యూయల్ రోల్ చేసేందుకు నాగార్జున ఒప్పుకున్నాడు. జాకీ చాన్ మూవీ ట్విన్ డ్రాగన్స్ మూవీ లో కవలలకు ఒకే రకమైన రియాక్షన్లు అనే చిన్న పాయింట్ తీసుకుని ఫక్తు తెలుగు కమర్షియల్ ఫార్మాట్ లో అదిరిపోయే హాస్యం, నవ్వుల భోజనంతో ఏకంగా బిర్యానీ వడ్డించారు హలో బ్రదర్ మేకర్స్. ప్రముఖ రచయిత నటుడు ఎల్బి శ్రీరామ్ రాసిన కామెడీ డైలాగ్స్ అప్పట్లో ఓ రేంజ్ లో పేలాయి. ఆ సినిమాలోని సీన్స్ డైలాగ్స్ చూస్తుంటే ఇప్ప్పటి ఆడియన్స్ కి కూడా కిక్కిస్తుంది. అప్పటివరకు లవ్ అండ్ యాక్షన్, ఇంకా ఫ్యామిలీ స్టోరీస్ చేసిన నాగ్ ని పూర్తిగా మార్చేస్తూ నాగార్జున లోని పూర్తి స్థాయి కామెడీ యాంగిల్ ని చూపిస్తూ ఇవివి క్రియేట్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇక నాగ్ తో పాటు బ్రహ్మానందం, గిరి బాబు, రమ్యకృష్ణ, బాబు మోహన్, కోట శ్రీనివాస రావు, మల్లికార్జున్ రావు కాంబోలో కామెడీ ఓ రేంజ్ లో పేలింది.

అవార్డులు రివార్డులు..

ఇక హలో బ్రదర్ మూవీకి ఒక సైడ్ కామెడీ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిస్తే, మరో వైపు రాజ్ కోటి స్వరపరిచిన ఆరు పాటలు సినిమాకు ఆరో ప్రాణంగా నిలిచాయి. క్లాస్, మాస్ రెండు వర్గాలు ఇప్పటికీ వినేలా అద్భుతంగా కుదిరాయి. ఇక రెండు విభిన్న స్లాంగ్స్ తో నాగార్జున చూపించిన మ్యానరిజమ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి.ఇక ఆ రోజుల్లో కమర్షియల్ గానూ ‘హలో బ్రదర్’ భారీ విజయం నమోదు చేసుకుంది. తక్కువ గ్యాప్ లో బాలకృష్ణ భైరవ ద్వీపం, యమలీల వంటి క్లాసిక్ హిట్స్ తో పోటీ పడాల్సి వచ్చినా వసూళ్ల పరంగా నాగార్జున కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధించింది. అప్పటికీ హైయెస్ట్ గ్రాసర్ గా టాప్ 3 ప్లేసులో నిలిచింది. ఇక ఆ తర్వాత నాగార్జున నటించిన ఎన్నో సినిమాల్లో కామెడీ సీన్లు చేసినా ఈ రేంజ్ లో కామెడీ పేలిన సినిమాలు అంతగా రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు