Harish Shankar : మీ గౌరవాన్ని కాపాడుకోండి నాయుడు గారు.. హరీష్ స్ట్రాంగ్ వార్నింగ్!

Harish Shankar : టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం హీరోలకి పర్ఫెక్ట్ మాస్ ఎంటెర్టైనెర్స్ అందించే దర్శకుడీయన. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగా పిలిపించుకునే హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే రవితేజ తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఫేమస్ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గురించి కూడా అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు ఆయన సినిమాటోగ్రఫీ అందిస్తుంటారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరకు పనిచేస్తున్నారు. అయితే చోటా నాయుడు తరచూ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఆ సమయంలో తాను చేసిన సినిమాలతో పాటు పలువురు హీరోల గురించి మాట్లాడుతుంటారు. కొన్ని అనుభవాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి చోటా కె నాయుడు నెగిటివ్ గా ప్రస్తావించారు.

నా వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యాడు – చోటా

ఆ ఇంటర్వ్యూ లో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా టైమ్ లో తన వర్క్ లో హరీష్ శంకర్ ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు చోటా. అలాగే తనను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడని, చివరకు చేసేదేమి లేక హరీష్ కు ఎలా కావాలో అలాగే వర్క్ చేశానంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా హరీష్ శంకర్ స్పందించారు. అఫిషియల్ గా లేఖ రాసి స్ట్రాంగ్ గా ఘాటుగానే బదులిచ్చాడు హరీష్ శంకర్. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. తనను అవమానించడం కరెక్ట్ కాదని ఆ పోస్ట్ లో చెప్పుకొచ్చారు.

మీ గౌరవం కాపాడుకోండి..

ఇక చోటా వ్యాఖ్యలకు స్పందించిన హరీష్ శంకర్ (Harish Shankar) రాసిన లేఖ ప్రకారం, అందులో ఇలా ఉంది. “గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ… రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ తో షూటింగ్‌ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో ‘గబ్బర్ సింగ్‌ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ ని తీసేస్తున్నాడు.. అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే “గబ్బర్ సింగ్” వచ్చినప్పుడు నాది “రామయ్యా వస్తావయ్యా” వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది.

- Advertisement -

మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.” “ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే any day any platform IAM Waiting – భవదీయుడు హరీష్ శంకర్‌” అని తన ట్విట్టర్ అకౌంట్ లో లెటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ లేఖ తెగ వైరల్ అవుతుంది. దీనిపై చోటా ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు