Hot Movies on OTT : ఈ స్పైసీ సినిమాలను ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు

Hot Movies on OTT : ఓటిటికి సెన్సార్ అనే అడ్డంకి లేదు కాబట్టి అన్ని జానర్లకు సంబంధించిన సినిమాలను ఇక్కడ హ్యాపీగా చూడొచ్చు. ముఖ్యంగా హాట్ అండ్ స్పైసీ సినిమాలను చూడాలనుకునే వారికి ఓటిటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోలేకపోయే కొన్ని సినిమాలను ఫ్యామిలీతో మాత్రం చూడకండి. ఒంటరిగా లేదంటే కపుల్స్ మాత్రమే ఈ సినిమాలను చూస్తే బాగుంటుంది. మరి ఓటిటిలో అందుబాటులో ఉన్న ఏ సర్టిఫికెట్ బెస్ట్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1. రాగిణి ఎంఎంఎస్

ఓ అమ్మాయి తను బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫామ్ హౌస్ కి వెళుతుంది. అక్కడ ఆమె అతీత శక్తుల బారిన పడ్డాక ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సాగుతుంది రాగిణి ఎంఎంఎస్ అనే హిందీ మూవీ. ఇందులో ఘాటైన మసాలా సీన్లతో పాటు భయపెట్టే హారర్ సీన్లు కూడా ఉంటాయి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

2. బిఏ పాస్

ఎంబీఏ చదివి తన కుటుంబానికి ఫైనాన్షియల్ గా అండగా ఉందామని సిటీకి వస్తాడు ఓ యువకుడు. ఆ తర్వాత మహిళ మోజులో పడ్డ ఆ యువకుడి కథ ఎలా మలుపు తిరిగింది అన్నదే బిఏ పాస్ మూవీ. ఈ సినిమాలో సింగిల్స్ కోసమే అన్నట్టుగా బోలెడన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ లో బిఎ పాస్ అనే ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

3. అన్ ఫెయిత్ ఫుల్

నెట్ ఫ్లిక్స్ లో హాట్ సినిమాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అన్ ఫెయిత్ ఫుల్ మూవీ మరింత స్పైసీగా ఉంటుంది. ఓ పెళ్ళైన మహిళ కొత్త వ్యక్తిపై మోజు పడే కథాంశంతో అన్ ఫెయిత్ ఫుల్ సాగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

4. లిప్స్టిక్ అండర్ మై బుర్కా

సాంప్రదాయాలు కట్టుబాట్ల నుంచి దూరంగా పారిపోవాలనుకునే నలుగురు యువతుల చుట్టూ తిరిగే స్టోరీనే ఈ లిప్స్టిక్ అండర్ మై బుర్కా మూవీ. నిజానికి ఇదొక బ్లాక్ కామెడీ మూవీ. అయితే టైటిల్ తో పాటే మూవీ కూడా చెప్పలేనని వివాదాల్లో ఇరుక్కుంది. కానీ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

5. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే

2011లో వచ్చిన నవల వచ్చిన ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే అనే నవల ఆధారంగా ఈ ఏరోటిక్ రొమాంటిక్ డ్రామా తెరపైకి వచ్చింది. సామ్ టైలర్ జాన్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జెమీ డార్నన్, డకోట జాన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్ ఫ్లిప్స్లో చూడొచ్చు.

6. బేసిక్ ఇన్‌స్టింక్ట్

1992లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ బేసిక్ ఇన్‌స్టింక్ట్ . రొమాంటిక్ జానర్ సినిమాలను ఇష్టపడే వాళ్ల కోసమే అన్నట్టుగా ఈ మూవీలో కావాల్సినన్ని హాట్ సీన్లు ఉంటాయి. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఈ మూవీకి ఇప్పటికీ ఓటిటిలో మంచి డిమాండ్ ఉంది. ఓ స్టార్ హత్యకు గురవ్వడం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే సాగుతుంది బేసిక్ ఇన్స్టింగ్.

7. బిట్టర్ మూన్

ఓ వీల్ చైర్ కే పరిమితమైన భర్త, అతని భార్య చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ స్టోరీ. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ మూవీని ఒంటరిగా మాత్రమే చూడండి.

8. వైల్డ్ థింగ్స్

క్రైమ్ థ్రిల్లర్ తో పాటు స్పైసీగా ఉండే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు