Thalaivar171 : అంచనాలని మించిపోతున్న రజిని – లోకి మూవీ..! తాజాగా మరో స్టార్ హీరో ఎంట్రీ?

Thalaivar171 : సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ఊపు మీదున్నారు. జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు నాలుగు సినిమాలు లైన్లో పెట్టిన తలైవా, రీసెంట్ గా వచ్చిన లాల్ సలాం ప్లాప్ అయినా కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ యంగ్ హీరోల రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఇక రజినీకాంత్ హీరోగా తన 171వ సినిమాను తలైవర్171 అనే వర్కింగ్ టైటిల్ తో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై సౌత్ ఇండియా వ్యాప్తంగా ఓ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అభిమానులకు వింటేజ్ లుక్ ను రజినీకాంత్ ను గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలు కాగా రెగ్యులర్ షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటుంది.

భారీ క్యాస్టింగ్ తో తలైవర్171..

ఇక రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై(Thalaivar171) పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో మైక్ మోహన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్స్ ని ఈ సినిమాలో నటింపచేస్తున్నారట. మలయాళ స్టార్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్, అలాగే కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి ఈ సినిమాలో భాగం కానుండగా, బాలీవుడ్ నుండి రణవీర్ సింగ్ కూడా ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నాడట. అలాగే రాఘవ లారెన్స్ కూడా కీలక పాత్ర చేయనున్నాడట. ఇక తాజాగా తలైవర్171 లో మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ భాగం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్త తెలిసినప్పటినుండి ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కింగ్ నాగార్జున ఎంట్రీ..

ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ సినిమాలో టాలీవుడ్ నుండి కింగ్ నాగార్జున ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ఇప్పటీకే నాగార్జున ని సంప్రదించినట్టు, కథ విన్న నాగ్ కూడా ఒకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. ఇక ఈ వార్తా విన్నప్పటి నుండి నాగార్జున ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.. ఏప్రిల్ 22వ తేదీన లేదా మే మొదటివారం లో ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయబోతున్నారట. టీజర్ తో పాటే టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందట. మరి నాగార్జున పాత్ర ఈ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు