Crakk OTT Release Date : ఎనిమిదేళ్ళ తరువాత అమీ జాక్సన్ చేసిన యాక్షన్ మూవీ… రిలీజ్ ఎప్పుడంటే?

Crakk OTT Release Date : ఆరేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ అమీ జాక్సన్ కొత్త మూవీ క్రాక్ తాజాగా ఓటిటీ ఎంట్రీకి రెడీ అయింది. విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అమీ జాక్సన్, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించిన ఈ బాలీవుడ్ మూవీ ఏప్రిల్ 26న డిస్నీ ప్లస్ హార్ట్ స్టార్ లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రాక్ మూవీని విద్యుత్ జమ్వాల్ స్వయంగా నిర్మించడం విశేషం. హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇక అమీ జాక్సన్ రోల్ కంప్లీట్ గా యాక్షన్ తో కూడుకొని ఉంటుంది. కానీ నోరా ఫతేహి మాత్రం గ్లామర్ పాత్రలో ఆకట్టుకుంటుంది.

క్రాక్ స్టోరీ ఇదే…

టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లలో మాత్రం దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. ముంబై స్లమ్ ఏరియాకు చెందిన సిద్దు అనే యువకుడు ఇంటర్నేషనల్ అండర్ గ్రౌండ్ సర్వైవల్ స్పోర్ట్స్ పోటీలో విజేతగా ఎలా నిలిచాడు? మాఫియా డాన్ దేవ్ పై సిద్దు ఎందుకు పగ పెంచుకుంటాడు? సిద్దు తన పగను ఎలా తీర్చుకున్నాడు అనే పాయింట్ తో ఆదిత్య దత్ అనే దర్శకుడు ఈ మూవీని రూపొందించాడు. అండర్ గ్రౌండ్ సర్వైవల్ స్పోర్ట్స్ అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమా తెరకెక్కినప్పటికీ స్టోరీ మొత్తం రొట్ట రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీని పట్టించుకోలేదు.

ఆరేళ్ల తర్వాత అమీ జాక్సన్ రీ ఎంట్రీ…

మధురాసి పట్టణం అనే తమిళ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ ఐ మూవీతో సౌత్ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ ఎవడు మూవీలో కనిపించింది ఈ బ్యూటీ. అనంతరం సౌత్ తో పాటు నార్త్ లో కూడా పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రజనీకాంత్ సరసన రోబో 2.0 అనే సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ. ఇది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ హిట్ కాకపోవడంతో అమీ కెరీర్ కి ఉపయోగపడలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు కావడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.

- Advertisement -

దీంతో ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది అమీ జాక్సన్. ప్రేమ, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల వల్ల దాదాపు ఆరేళ్ల తర్వాత మిషన్ చాప్టర్ వన్ అనే తమిళ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత హిందీలో క్రాక్ అనే మూవీని చేసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె చేసిన ఈ రెండు సినిమాలు ఏడాది గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి, బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు