Amazon Mini TV Telugu : అమెజాన్ మినీ టీవీ తెలుగులో… అందుబాటులో ఉన్న సినిమాలు ఇవే

Amazon Mini TV Telugu : తెలుగు ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇక నుంచి అమెజాన్ మినీ టీవీలో తెలుగు కంటెంట్ ను కూడా చూడొచ్చు. నిజానికి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, ఓటిటి వంటి ఓటిటిల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నప్పటికీ సబ్స్ట్రిప్షన్ ఉంటేనే చూసే అవకాశం ఉంటుంది. కానీ అమెజాన్ మినీ టీవీ మాత్రం కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.

తెలుగు, తమిళ భాషలో మినీ టీవీ

చాలా రోజులు దాకా కేవలం హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేసిన అమెజాన్ మినీ టీవీ తాజాగా తెలుగులోనూ వచ్చేసింది. నిజానికి అమెజాన్ గత కొన్నేళ్లుగా మినీ టీవీ అనే ఓటిటిని మూవీ లవర్స్ కు ఉచితంగా అందిస్తోంది. కానీ ఇన్నాళ్ళు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఓటిటిని తాజాగా తెలుగు, తమిళ భాషల్లో కూడా తీసుకొచ్చారు. అందులో ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించారు.

అందుబాటులో ఉన్న మూవీస్ ఇవే

అమెజాన్ మినీ టీవీలో ఇప్పటికే పలు ఆసక్తికరమైన ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మినీ టీవీలో హిందీ ఒరిజినల్స్ తో పాటు హాలీవుడ్, కొరియన్ మూవీస్, పలు డబ్బింగ్ సినిమాల వెర్షన్స్ అందుబాటులో ఉంటాయి. వాటన్నింటినీ తాజాగా తెలుగులోకి డబ్ చేసి తెలుగు మూవీ లవర్స్ ను కూడా దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఉంది అమెజాన్. ఇక ఈ ఓటీటీలో 200కు పైగా సినిమాలు, వెబ్ షోలు తెలుగు, తమిళ భాషలోకి డబ్ చేసి వదిలారు.

- Advertisement -

ముఖ్యంగా మోస్ట్ వాంటెడ్ హిందీ ఒరిజినల్స్ హైవే లవ్, ఫిజిక్స్ వాలా, రక్షక్, హంటర్ వంటి సిరీస్ లను తెలుగులో రిలీజ్ చేశారు. వీటితో పాటే ట్విలైట్, నౌ యు సి మీ, హంగర్ గేమ్స్ సిరీస్, రైట్ లాంటి బ్లాక్ బస్టర్ హాలీవుడ్ సినిమాలను తెలుగులో చూడొచ్చు. ఇక కొరియన్, మాండరిన్, టర్కిష్ భాషల వెబ్ సిరీస్ ను కూడా తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు.

జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు

అమెజాన్ మినీ టీవీ హెడ్ అమోఘ్ దుసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఫేవరెట్ షోలను తమకు నచ్చిన భాషలో ఆస్వాదించాలి అన్న లక్ష్యంతోనే ఈ డబ్బింగ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఇక అమెజాన్ మినీ టీవీ యాప్ తో పాటు వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది.

అమెజాన్ షాపింగ్ యాప్ లో మినీ టీవీ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి కూడా సపరేట్ గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కనీసం రిజిస్టర్ కూడా చేసుకోకుండానే మినీ టీవీలోని కంటెంట్ ను ఫ్రీగా వీక్షించవచ్చు. ఇప్పుడు తెలుగులో కూడా మినీ టీవీ అందుబాటులో ఉండడం వల్ల దీనికి రాను రాను క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు