Hyper Adhi: అనసూయతో రిలేషన్ పై.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!!

Hyper Adhi.. తెలుగు బుల్లితెరపై హైపర్ ఆది క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా జబర్దస్త్ లో తన కామెడీ పంచ్ డైలాగులతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హైపర్ ఆది అదే లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ క్రేజ్ తో సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి వీర అభిమానినని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే పలు సినిమాలలో అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి.

Hyper Adhi: Hyper Adi shocking comments on relationship with Anasuya..!!
Hyper Adhi: Hyper Adi shocking comments on relationship with Anasuya..!!

బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కమెడియన్..

ఇటీవల కాలంలో హైపర్ ఆది జబర్దస్త్ షో కి దూరమయ్యారు.. ప్రస్తుతం ఢీ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. బుల్లితెర పైన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే కమెడియన్ గా కూడా పేరు సంపాదించారు. ప్రస్తుతం జనసేన పార్టీకి స్టార్ క్యాంపియన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు హైపర్ ఆది. ఇలా బిజీగా ఉన్నప్పటికీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది.. తన కెరియర్ లో జరిగిన విషయాలను, జబర్దస్త్ ప్రోగ్రాం గురించి, అనసూయ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

జబర్దస్త్ ఎంట్రీ..

ముఖ్యంగా స్టార్ యాంకర్ అయినటువంటి అనసూయతో ఉన్న రిలేషన్ పైన ఓపెన్ అవుతూ వారి విషయాలను తెలిపారు.. హైపర్ ఆది మాట్లాడుతూ.. జబర్దస్త్ లోకి రాకముందు తాను ఒక ఉద్యోగం చేసే వాడినని.. ఆ సమయంలో తన కుటుంబం మొత్తం అప్పులలో ఉందని.. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని.. ఆ సమయంలో తన తండ్రి తమకు ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మేసి అప్పులు కట్టేసారని తెలియజేశారు. ఆ తర్వాత కొంతమంది పరిచయస్తుల వల్ల జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాను.. అలా బాగా సక్సెస్ అయ్యానని తెలిపారు హైపర్ ఆది.

- Advertisement -

అనసూయ పై కామెంట్స్..

అనసూయ విషయం పైన హైపర్ ఆది మాట్లాడుతూ.. అనసూయతో నాకు మంచి ర్యాపో ఉంది. అందుకే అనసూయతో ఎక్కువగా స్కిట్లు చేసే వాడిని.. అనసూయ కూడా నా ప్రతి స్కిట్ కు సపోర్ట్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుందంటూ తెలిపారు. తన స్కిట్ కు కావలసిన రియాక్షన్ కూడా అనసూయ ఇట్టే ఇచ్చేస్తుందంటూ వెల్లడించారు హైపర్ ఆది. ప్రస్తుతం అనసూయ పైన చేసిన హైపర్ ఆది కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. దీంతో పలువురు నెటిజెన్స్ ఈ విషయం పైన పాజిటివ్ , నెగిటివ్ గానే కామెంట్స్ చేస్తున్నారు.

ఆది కామెంట్స్ కి నెటిజెన్స్ ట్రోల్స్..

హైపర్ ఆది అనసూయ గురించి చేసిన కామెంట్లపై నేటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తించడం వల్లే ఆమె జబర్దస్త్ నుంచి వీడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు గతంలో అనసూయ జబర్దస్త్ లో బాడీ షేవింగ్ కారణంగా షో ని వదిలేస్తున్నాను అంటూ చెప్పిన విషయం తెలిసిందే ..అయితే అనసూయ పై ఎక్కువగా చనువు తీసుకొని మాట్లాడేది హైపర్ ఆది మాత్రమే. అందుకే అనసూయ ఆది మాటలకు హర్ట్ అయ్యి జబర్దస్త్ వీడింది అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు