24YearsOfBadri : పవర్ స్టార్ పెను సంచలనానికి 24ఏళ్ళు..

24YearsOfBadri : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరంటే టాలీవుడ్ లోనే ఒక సెన్సేషన్. మాస్ లో విపరీతమైన క్రేజ్. మెగాస్టార్ తమ్ముడు అనే పిలుపు నుండి పవర్ స్టార్ గా నిలబెట్టిన పవన్ కళ్యాణ్ కి ఇంత పేరు తెచ్చిపెట్టిన సినిమాలేవి అంటే ఒక్క సినిమా గురించి చెప్పడం కష్టం. ఎందుకంటే ఆయన పేరుతోనే ఆడిన సినిమాలు కూడా ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే ఎంట్రీ ఇచ్చినా తనకి కెరీర్ ని టర్న్ చేసి ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు. ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ ని యూత్ కి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టాయి. కానీ పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ గా మాస్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ని తెచ్చిపెట్టింది మాత్రం ‘బద్రి’ అనే చెప్పాలి. ఆరోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలు కాదు. మెగాభిమానులు చొక్కాలు చించుకునే రేంజ్ లో ఈ సినిమా థియేటర్లలో ఓ పెను సంచలనం సృష్టించింది. అంతే కాదు టాలీవుడ్ కి ఓ డాషింగ్ డేరింగ్ డైరెక్టర్ ని పరిచయం చేసిన సినిమా ఇది. ఆయనే పూరి జగన్నాథ్. అలాంటి బద్రి అనే సెన్సేషన్ మూవీ విడుదలై నేటికీ సరిగ్గా 24 ఏళ్ళు. ఈ సందర్బంగా బద్రి విశేషాలపై ఓ లుక్కేద్దాం..

బద్రీనాథ్ గా పవన్.. మాస్ క్రేజ్ కి పరాకాష్ట..

టాలీవుడ్ లో అప్పటికి ఐదు సినిమాలు మాత్రమే చేసిన పవన్ కళ్యాణ్ అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించాడు. అప్పుడే వర్మ శిష్యుడైన పూరి జగన్నాథ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, చిరంజీవితో పలు బ్లాక్ బస్టర్ సినిమాలని నిర్మించిన త్రివిక్రమరావు నిర్మాతగా ‘బద్రి’ పేరుతో సినిమా తెరకెక్కించడం జరిగింది. రేణు దేశాయ్, అమీషా పటేల్ లు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2000 ఎప్రిల్ 20న రిలీజ్ కాగా, కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్ రేంజ్ లో అభిమానులని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక్కో డైలాగ్ డైనమిక్ గా ఉంటుంది. పవన్ లోని యాంగ్రీ ని సాలిడ్ గా వాడుకున్న పూరి పవన్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించాడు.

ఈ ఒక్క డైలాగ్ చాలు..

“నువ్వు నందవైతే నేను బద్రి.. బద్రినాథ్”. ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా క్రేజ్ ఏంటో ఇప్పటివాళ్లకు చెప్పడానికి. బద్రీనాథ్ అంటూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటుంటే థియేటర్లలో ఓ రేంజ్ విజిల్స్ పడ్డాయి. తొలి సినిమా నుండే పూరి జగన్నాథ్ హీరోలని తన స్టయిల్లో డిఫరెంట్ గా ఆవిష్కరిస్తూ తనని తాను నిరూపించుకున్నాడు. ఇక ర‌మ‌ణ ‌గోగుల సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ సినిమా పాట‌ల‌న్నీ అప్ప‌ట్లో యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించాయి. మ‌రీముఖ్యంగా ‘బంగాళాఖాతంలో’ ‘యే చికితా’ సాంగ్స్ తో పాటు మిగతా అన్ని పాటలు కూడా ఓ రేంజ్ హిట్టయ్యాయి. అప్పట్లో ఈ సినిమా క్యాసెట్లు ఓ రేంజ్ లో అమ్ముడు పోయాయి. ఇక ఈ సినిమాలో పవన్ కి ధీటుగా ప్రకాష్ రాజ్ పాత్ర కూడా మరో హైలెట్ అని చెప్పొచ్చు. చెల్లిని ప్రాణంగా చూసుకునే అన్నగా ఉంటూనే, పవన్ తో డిఫరెంట్ విలనిజాన్ని పండించాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలకు ఇప్పటికీ అదే క్రేజ్ వుంది. ఇక ఆ రోజుల్లోనే బద్రి (24YearsOfBadri ) సినిమా 85 థియేటర్లలో 50 డేస్, 47 థియేటర్లలో 100 డేస్ ని జరుపుకున్న ఈ సినిమా, ఆ రోజుల్లో 16 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. అమెరికాలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా కూడా చరిత్ర సృష్టించింది. ఇక ఈ సినిమాతోనే తరువాతి రోజుల్లో రేణుదేశాయ్ పవన్ జీవితంలో కి భార్య కూడా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు