Badri: పూరి… పూరిజగన్నాధ్

ఇండస్ట్రీలో ఒక కుర్రోడు అప్పటివరకు నానా పనులు చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్నాడు. ఆ కుర్రోడికి ఉన్న కల మాత్రం సినిమా తియ్యాలని. ఆ కుర్రోడికి నా అనుకున్న వాడు ఇండస్ట్రీలో ఎవడు లేడు, అయితేనేం… వాడికి అసలైన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్న థియేటర్ లో చూసిన సినిమాలు, వాళ్ళ నాన్న బీరువాలోనివి చదివిన పాత పుస్తకాలు. ఇవి చాలు కదా ఊహప్రపంచంలో నేనేంటో నిరూపించుకోవడానికి అనుకున్నాడు. ఆ ఊర్లో ఒక నాటకాన్ని డైరెక్ట్ చేసాడు ఆ కుర్రోడు.
వెంటనే వాళ్ళ నాన్న వాడి చేతికి కొంత డబ్బు ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి పోరా బాగుపడతావ్ అన్నాడు.

వచ్చాడు, బ్రతుకు సాగడానికి ఏవేవో పనులు చేస్తూ తన కలను సాకారం చేసుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నాడు. ఎట్టకేలకు ఒక సినిమా దర్శకత్వం చేసే అవకాశాన్ని సాధించాడు. ఆదిలోనే హంస పాదం అన్నట్లు ఆ సినిమా పూజ తోనే ఆగిపోయింది. ఇండస్ట్రీ లో మరోపక్క మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత , సుస్వాగతం , తొలిప్రేమ, తమ్ముడు వంటి సినిమాలతో హిట్టు మీద హిట్లు కొట్టుకుంటూ పైకి ఎదుగుతున్నాడు.

ఆ స్టార్ హీరోపైన ఈ కుర్రోడి కన్నుపడింది ఎలా అయినా తనకు కథ చెప్పాలనుకున్నాడు. శ్యాం కె నాయుడు కి ఒక మాట చెప్తే చోటా కె నాయుడుకి చెప్పు వర్కౌట్ అవుతుంది అన్నాడు. ఈ కుర్రోడుకి అప్పటికే తమ సీరియల్ డైరెక్ట్ చేయమని ఒక చెక్ ఇచ్చారు చోటా ఫ్యామిలీ.
చోటా ఫ్యామిలీ ఏదో పనిమీద బయటకి వెళ్లి వచ్చేలోపు ఇంట్లో ఆ కుర్రోడికి ఇచ్చిన చెక్ ఉంది. ఆ పక్కనే చిన్న లెటర్ కూడా ఉంది.

- Advertisement -

నాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థాంక్స్, కానీ మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్ నేను చెయ్యలేనేమో అనిపిస్తుంది దయచేసి నన్ను వదిలేయండి క్షమించగలరు
పూరి జగన్నాధ్

అని రాసిపెట్టి వెళ్ళిపోయాడు డైరెక్టర్ పూరి, కొన్ని రోజులు తరువాత మళ్ళీ చోటాను కలిస్తే ముందు నాకు కథ చెప్పు, నాకు కథ నచ్చితే నేను కళ్యాణ్ కి రికమెండ్ చేస్తా అన్నాడు. పూరి రాసుకున్న కథలో హీరో ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమిస్తాడు ఈ కథను చోటాకు చెప్తే ఎవడ్రా నువ్వు ఇలాంటి కథను చెప్పావు అంటాడేమో అని. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే అందమైన లవ్ స్టోరీ చెప్పాడు, దానికి ఇంప్రెస్ అయినా చోటా పవన్ కళ్యణ్ కి కాల్ చేసి చాలామంచి కథ విన్నాను అని చెప్పి జగన్ అనే కొత్త కుర్రాడు అని చెప్పగానే కళ్యాణ్ కథ వినడానికి అంగీకరించాడు.

కానీ పవన్ కళ్యాణ్ కి దగ్గరికి వెళ్ళి బద్రి సినిమా కథను చెప్పాడు పూరి.
క్లైమాక్స్ మార్చుకుని రమ్మంటే వారం తరువాత మళ్ళీ అదే క్లైమాక్స్ తో వెళ్ళాడు పూరి. నేను మార్చమంటే నువ్వు మారుస్తావో లేదని టెస్ట్ చేశా నాకు ఈ ఇదే నచ్చింది అని అన్నాడు. మొత్తానికి సినిమా చేసారు రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కళ్యాణ్ మెడపైన చేయి వేస్తే ఇప్పుడు ఆడియన్స్ ఊగిపోయే ఆ మ్యానరిజాన్ని క్రియేట్ చేసింది పూరి జగన్నాధ్. Vizag జగదాంబలో 54 రోజులువరకు ప్రతి 4 shows House full అయినా సినిమా బద్రి. పూరి చేసిన సినిమాల్లో రిస్కీ స్టోరీ ఇదే కానీ కన్వీన్స్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క సినిమా కూడా పూరి చూడలేదు. కొత్తవాళ్ళకి అవకాశం ఇస్తాడు అని తెలిసి, పవన్ కలిసి చేసి సినిమా చేసి హిట్ కొట్టాడు.

ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఇంకా ఖుషీ హ్యాంగోవర్‌లో ఉండగా, పవన్ మరో బ్లాక్ బస్టర్ బద్రి మూవీ ఫిబ్రవరి 4న రీ-రిలీజ్ సిద్ధమవుతోంది.
V సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి పవన్ కెరీర్‌ లో ఒక కల్ట్ చిత్రంగా మిగిలిపోయింది. పాటలు, డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి.బద్రిలో అమీషా పటేల్ మరియు రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించారు.త్రివిక్రమరావు ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు