RRRForOscars : జక్కన్న భావోద్వేగ ట్వీట్

దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”ఆర్.ఆర్.ఆర్” గత ఏడాది విడుదలైంది. మొదటి నుంచే హిట్ టాక్ తో సాగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ లో రికార్డులు సృష్టించి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు పాత్రలో పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకొని, ఎన్నో భాషల్లోని ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.మరో వైపు ఎన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కించుకుంటుంది.

తాజా గా ఈ సినిమాలోని ”నాటు నాటు” సాంగ్ ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో నామినెషన్స్ లో నిలవటంతో తెలుగు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై తాజాగా దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

”ఈ సాంగ్ ని ఇంత గొప్ప గా కంపోస్ చేసినందుకు పెద్దన్న కీరవాణి గారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పిన తక్కువే. ఈ సాంగ్ కు ఆకర్షణీయమైన డ్యాన్స్ స్టెప్స్ ను కంపోస్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి , దీనిని అద్భుతంగా పాడిన రాహుల్ మరియు భైరవ కి, ఈ పాట ని ఎంతో అద్భుతంగా రాసిన చంద్రబోస్ గారికి, మరి ముఖ్యంగా నా టార్చర్ భరించి, ఆస్కార్ రేస్ లో మాటు మాటు ఉండేలా ఎంతో కాష్ట పడి పెర్ఫార్మన్స్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కు, మరియు ప్రతి ఒక్క ఆర్.ఆర్.ఆర్ టీం సభ్యులకి ప్రత్యేక శుభాకాంక్షలు” అని రాసారు.

అలానే “నాటు నాటు మరింత మందికి చేరువాయేలా చేసిన వాల్ ట్రెండ్స్ వారికీ, ఈ పాట ను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆస్కార్ ను చేరుకొనేందుకు నేను కూడా చాల ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న” అని ట్విట్టర్ లో జక్కన్న రాసుకొచ్చాడు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు