Keerthy suresh:బిజీనెస్ మ్యాన్ తో లవ్..?

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మహానటి సినిమాతో సినీ ప్రపంచంలో తాను మహానటిని అని నిరూపించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సినీ నేపద్యం ఉన్న ఇంటి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల సరసర నటించింది. ఎక్కడ గ్లామర్ డోస్ లేకుండా కేవలం కంటెంట్ ఉన్న పాత్రలనే చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

అయితే ఈమధ్య ఈమె నటించిన ఏ సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వడం లేదు. మహానటి తరువాత సర్కారు వారి పాటలో కాస్త బోల్డ్ గా కనిపించినప్పటికీ ఆ సినిమా అంత పెద్ద విజయం ఏమి సాధించలేదు. ఇదిలా ఉంటే వివాదాలకు దూరంగా ఉండే ఈ మలయాళీ ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో ఉందని, వీరు దాదాపు 13 ఏళ్ల నుంచి సీక్రెట్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అతను కేరళకి చెందిన ఓ వ్యాపారవేత్త అని, అతనికి చాలా రిసార్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కీర్తి సురేష్ మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదట.

- Advertisement -

మరో నాలుగేళ్ల తర్వాతే వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కీర్తి సురేష్ పెళ్లి పై గతంలోనూ ఇలాంటి ప్రచారమే పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో ఇదంతా తప్పుడు ప్రచారమని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. తాజాగా మరోసారి కీర్తి సురేష్ ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ నానితో దసరా, మెగాస్టార్ చిరంజీవితో బోళాశంకర్ సినిమాలో నటిస్తోంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు