My dear Donga Review : ఓటిటిలో అభినవ్ గోమటం కొత్త మూవీ… ఎలా ఉందంటే?

My dear Donga Review : తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలో తాజాగా మై డియర్ దొంగ అనే కొత్త మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో అభినవ్ గోమటంతో పాటు శాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఆహాలో డైరెక్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ

సుజాత (శాలిని కొండెపూడి) డేటింగ్ యాప్ లో పని చేస్తుంది. వరుణ్ (నిఖిల్ గాజుల)తో ఆమె రిలేషన్ గొడవలతో సాగుతుంది. సుజాతకు అతనితో రిలేషన్ హ్యాపీగా అనిపించదు. తన బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి (దివ్య శ్రీపాద)తో సహా అందరూ తనను ఇగ్నోర్ చేశారని సుజాత భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సురేష్ (అభినవ్ గోమటం) అనే దొంగ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. అయితే ఆ దొంగ తనతో బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది సుజాతకు. మరి ఒక చిన్న దొంగ సుజాత జీవితాన్ని ఎలా మార్చాడు ? అనేదే మై డియర్ దొంగ మూవీ కథ.

విశ్లేషణ

అవుట్ డేటెడ్ స్టోరీతో రావడమే ఈ మూవీకి అతి పెద్ద మైనస్. మాట్లాడ్డానికి ఎవరూ లేకపోవడం వంటి శాలిని ఎమోషనల్ అంశాన్ని టచ్ చేసి సినిమాని యువకులకు రిలేట్ అయ్యేలా చేయగలిగాడు డైరెక్టర్. కానీ కోర్ పాయింట్ ని జస్టిఫై చేసేంత ఎమోషనల్ డెప్త్ మాత్రం మూవీలో లేదు. ఇక దొంగ సాధరణ హావభావాలు శాలిని జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి అనే విషయం అర్థం అవుతుంది. కానీ మూవీ ఫ్లాట్ గా సాగడం వల్ల తగినంత ఎమోషనల్ గా కనెక్ట్ ఎవ్వడు. కాబట్టి కొన్ని సన్నివేశాలు అంత కన్వీన్సింగ్ గా అనిపించవు. అలాగే చివరి 20 నిమిషాలు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. సిచువేషన్ కామెడీ అస్సలు బాలేదు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సన్నివేశం. అలాగే కొన్ని సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. స్టోరీ మరీ ఫ్లాట్ గా ఉండటమే ఈ సినిమాకు ప్రధాన లోపం.

- Advertisement -

నటీనటులు

అభినవ్ గోమటం కాస్త ఆలస్యంగానైనా సరే విలక్షణమైన పాత్రలు చేస్తున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ మూవీని చూశాక. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు అభినవ్. ఇక మిగతా నటినట్లు కూడా ఓకే అనిపిస్తారు. మై డియర్ దొంగ మూవీకి శాలిని రచయితగా వ్యవహరిస్తూనే హీరోయిన్ గా కూడా నటించింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. డైలాగ్స్, కామెడీ టైమింగ్ కూడా పర్లేదు. ఇక సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి.

టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకుంటే…

అజయ్ అరసాడ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉన్నాయి. అలాగే మనోజ్ ఎస్ఎస్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. బిఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం జస్ట్ ఓకే.

మొత్తం మీద మై డియర్ దొంగ ఆధునిక రిలేషన్స్ లోని సమస్యలను తేలికైన రీతిలో పరిష్కరించే తీరుగా సాగే మూవీ. పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే మై డియర్ దొంగ మూవీతో టైం పాస్ బాగానే అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు