Nagarjuna: నాగార్జున ఆ పాడు పనులు… సీరియస్ అయిన అమల ?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఇప్పటి అక్కినేని అఖిల్ వరకు ఎన్నో సినిమాలు చేశారు. అలాగే ఎన్నో సినిమాలు హిట్లు కూడా కొట్టేశారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున వచ్చిన సంగతి తెలిసిందే. తన నాన్న లాగే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కావాలనే లక్ష్యంతో అక్కినేని నాగార్జున తన వర్క్ చేశారు.

చాలా కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు అక్కినేని నాగార్జున. కుటుంబాన్ని చూసుకుంటూనే అటు అన్నపూర్ణ స్టూడియోను మెయింటెనెన్స్ చేసుకుంటూ… సినిమా హీరోగా నిలదొక్కుకున్నారు. కొంతమంది వారసత్వం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సక్సెస్ కాలేరు. అలాంటివారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ అక్కినేని నాగార్జున అలా కాదు. తన నాన్న నుంచి వచ్చిన వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఇండస్ట్రీని దున్నేసాడు అని చెప్పవచ్చు.

టాలీవుడ్ ఇండస్ట్రీ మన్మధుడు అని కూడా మనం అనవచ్చు. ఇద్దరు కొడుకులు పెళ్లి వయసుకు వచ్చినా కూడా యంగ్ హీరోల కనిపిస్తాడు అక్కినేని నాగార్జున. సినిమాలతో పాటు తన గ్లామర్ కూడా మెయింటెనెన్స్ చేయడంలో దిట్ట అక్కినేని నాగార్జున. ఎలాంటి స్టార్ హీరోయిన్లైన లేదా యంగ్ హీరోయిన్లు అయినా అక్కినేని నాగార్జున పేరు చెప్పితే కచ్చితంగా మేము కూడా సినిమా చేస్తాం అని ఎగబడతారు. అంతలా అక్కినేని నాగార్జున తన గ్లామర్ తో పాటు తన స్టార్ డంను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

తన వ్యాపారాలను చూసుకుంటూనే సినిమాలు చేస్తున్నారు అక్కినేని నాగార్జున. ఏడాదిలో కనీసం మూడు సినిమాలు కచ్చితంగా రిలీజ్ చేస్తారు. అందులో రెండు ఆడక పైన ఒక సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ తో దాదాపు 5 సంవత్సరాల నుంచి తన కెరీర్ కొనసాగిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఇటీవలే సంక్రాంతి పండుగకు కూడా మరో హిట్ అందుకున్నాడు ఈ నవ సామ్రాట్. అయితే అక్కినేని నాగార్జున సక్సెస్ అయిన తరహాలో తన కొడుకులు సక్సెస్ కావడం లేదు.

అక్కినేని నాగచైతన్య ఆటో ఇటో కొన్ని సినిమాలు సక్సెస్ చేసుకున్నాడు. కానీ అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటివరకు మంచి హిట్ అందుకోలేకపోయాడు. ఎంతో కష్టపడుతున్నాడు తప్ప ప్రతిఫలం ఉండటం లేదు. ఇదొక్కటే అక్కినేని నాగార్జున ను కలవర పెట్టే అంశం. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత విపరీతంగా తాగుడుకు అలవాటయ్యాడట అక్కినేని నాగార్జున.

అదే సమయంలో హీరోయిన్ అమలాను అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాగా తాగేవాడట. అయితే అక్కినేని నాగార్జునకు మంచి విషయాలు చెప్పి మందు తాగడం తగ్గించేసిందట అమల. దీంతో అప్పటినుంచి అక్కినేని నాగార్జున ఏదైనా సందర్భం వస్తే తప్పితే అస్సలు తాగడం లేదట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు