Thalaivar171: తలైవర్ 171 పై బిగ్ అప్డేట్.. భారీ తారాగణం..!

Thalaivar 171.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా తన కొత్త ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో లోకేష్ కనగరాజు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై తమిళ ఆడియన్స్ లో మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇటీవల ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అభిమానులకు వింటేజ్ లుక్ ను రజినీకాంత్ ను గుర్తు చేశారు చిత్ర బృందం.. ఇదిలా ఉండగా ఇందులో భారీ తారాగణం భాగం కానున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు..

తలైవర్ 171లో భారీ క్యాస్ట్..
ఇకపోతే ఈ సినిమాలో మైక్ మోహన్ విలన్ పాత్ర పోసిస్తున్నట్లు సమాచారం. అలాగే షారుక్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.. అంతేకాదు ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కూడా ఇందులో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికైతే అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ కి సంబంధించి స్టార్ కాస్ట్ ఇందులో భాగం కాబోతుండడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నారని చెప్పవచ్చు..

ఫస్ట్ లుక్ టీజర్ డేట్ లాక్..
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయబోతున్నారట. అంతేకాదు టీజర్ విడుదల చేయడంతో పాటు సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందట.. ఇక ఈ విషయాన్ని టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.. రీసెంట్గా ఈ డైరెక్టర్ ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు..

- Advertisement -

తలైవర్ 171 పై సందీప్ రెడ్డి కామెంట్స్..
ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. నాకు విక్రం సినిమా చాలా బాగా నచ్చింది.. ఇటీవల లోకేష్ కనగరాజును కూడా కలుసుకున్నాను. ఆ సమయంలో రజినీకాంత్ కొత్త సినిమా టీజర్ ని చూశాను .. ఆ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు మొత్తానికైతే ఈ కామెంట్స్ తో టీజర్ కూడా రిలీజ్ అవుతుందని తెలియజేయడమే కాకుండా టీజర్ పై అంచనాలను భారీగా క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ.. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. మొత్తానికైతే రజినీకాంత్ మరొకసారి ఈ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రజినీకాంత్ ఇటీవలే లాల్ సలాం సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు.. అయితే ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు