Gautham Vasudev Menon : ఇద్దరు దర్శకులు రెండు వేర్వేరు అభిప్రాయాలు

Gautham Vasudev Menon Movies : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నారు అయితే ఒక్కో ఒక్కో దర్శకుడు కి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాలు ఆయా సినిమాలు ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి. అయితే కొందరి దర్శకుల అభిప్రాయాలతో కొందరు ఏకీభవిస్తారు ఇంకొందరు ఏకీభవించరు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ సెన్సేషన్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించి అద్భుతమైన ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ తన సినిమా రిలీజ్ కంటే ముందే బాగా పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించిన వివాదం విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వివాదాలు దాటుకుంటూ ఆ సినిమా రిలీజ్ అయింది. అలానే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది.

అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కించి అక్కడ కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలామంది బాలీవుడ్ సినిమా జర్నలిస్టులు సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేసి ఆ సినిమాను వైలెంట్ ఫిల్మ్ గా చెప్పుకొచ్చారు. వాళ్లందరికీ సమాధానంగా అనిమల్ అనే సినిమాను తీశాడు సందీప్ రెడ్డివంగ. అయితే ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాకింగ్ సాధించుకుని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ లు సాధించింది. దాదాపు 1000 కోట్లు పైగా వసూలు చేసి బాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సక్సెస్ తో తెలుగు దర్శకుడు సత్తా ఏంటి అనేది బాలీవుడ్ లో మరోసారి రుజువు అయింది.

ఇకపోతే అనిమల్ సాధించిన ఘనవిజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే అనిమల్ సినిమా గురించి చాలామంది సెలబ్రిటీలు కూడా మాట్లాడుతూ వచ్చారు. చాలామందికి ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమా గురించి చాలామంది ట్వీట్ లు వేయడం ఇంస్టాగ్రామ్ స్టోరీ కి పెట్టడం వంటివి జరిగింది. అలానే ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారిలో కొందరికి చాలా ధీటుగా సమాధానం చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. అయితే సందీప్ కి ఇష్టమైన కొందరు సెలబ్రిటీలకి కూడా ఈ సినిమా నచ్చలేదు. వాళ్ళు ఈ సినిమా గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన కూడా వాటిని గౌరవిస్తూ వచ్చాడు సందీప్ రెడ్డి వంగ.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా మాట్లాడారు. ఈ సినిమా లో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ గురించి ఒక ఎక్స్ప్లనేషన్ ఇస్తూ వచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఇది చాలామందికి నచ్చింది. అయితే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను సందీప్ చెప్పిన ఆల్ఫా మేల్ క్యారెక్టర్ ను అగ్రీ చేయను అంటూ చెప్పుకొచ్చాడు. అలానే అనిమల్ సినిమాని చాలా ఇబ్బందిగా తాను చూసాను అంటూ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ చూసిన తర్వాత సెకండాఫ్ ఐదు రోజుల తర్వాత చూశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు గౌతమ్ వాసుదేవ్. సందీప్ ఫ్యాన్స్ ఇది చూసిన తర్వాత నేనెవరో నా సినిమాలు ఏంటి అని మాట్లాడుకుంటారని కూడా ఫన్నీ వే లో చెప్పుకొచ్చాడు గౌతం.

ఇకపోతే రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ వాసుదే మీనన్ గురించి సందీప్ రెడ్డి వంగ మాట్లాడారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన “విన్నయతాండవ వరువాయ” సినిమా తనకు చాలా ఇష్టమని చెప్పకు వచ్చాడు సందీప్ రెడ్డి. ఇదే సినిమాను తెలుగులో ఏ మాయ చేసావే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఇకపోతే సందీప్ కి కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా గౌతమ్ మీనన్ తీసిన అన్ని సినిమాలు తనకు ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు సందీప్. ఇలా తన సినిమా గురించి వేరేలా మాట్లాడినా కూడా తను జెన్యూన్ గా లవ్ చేసిన వర్క్ మాత్రం ఓపెన్ గా చెప్తుంటాడు సందీప్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు